నేను మంత్రగత్తెగా మారబోతున్నా... | Singer Adele says she is going to become a witch | Sakshi
Sakshi News home page

నేను మంత్రగత్తెగా మారబోతున్నా...

Apr 6 2016 2:39 PM | Updated on Sep 3 2017 9:20 PM

నేను మంత్రగత్తెగా మారబోతున్నా...

నేను మంత్రగత్తెగా మారబోతున్నా...

బ్రిటిష్ గాయకురాలు, గీత రచయిత అదెలే లౌరీ బ్లూ ఎడ్కిన్స్ (27) సంచలన ప్రకటన చేసింది

లండన్

బ్రిటిష్  గాయకురాలు, గీత రచయిత  అదెలే లౌరీ బ్లూ ఎడ్కిన్స్  (27) సంచలన  ప్రకటన చేసింది . అద్భుతమైన గాత్రంతో   వందకు పైగా ప్రతిష్ఠాత్మక అవార్డులు, రెండువందల నామినేషన్లు సాధించిన ఈ అమ్మడు  తాను భవిష్యత్తులో మంత్రగత్తెగా మారబోతున్నట్టు ప్రకటించింది. ఒకానొక సందర్భంలో తన  చేతికొచ్చిన  క్రిస్టల్స్ పై  బాగా నమ్మకం పెరిగిన తరువాత తనకు ఈ అనుభూతి కలిగిందని  చెప్పుకొచ్చింది.


ఒక  ప్రదర్శన సందర్భంగా అభిమానులతో  అదెలె తన అనుభవాన్ని పంచుకున్నారు.  న్యూయార్క్ లో తన  ఆల్బమ్   మొదటి షో  సందర్బంగా  ఒక హిప్పీ తనకు  కొన్ని స్ఫటికాలు ఇచ్చిందని  అప్పటినుంచి కరియర్ లో తనకు  ఎదురు లేకుండా పోయిందని వ్యాఖ్యానించింది.  ఆ స్పటికాలు తన వెంట ఉండడం వల్లే  గొప్పగొప్ప  షోలు  చేయగలుగుతున్నానని అభి ప్రాయపడింది. ఆ క్రిస్టల్స్ మీద నమ్మకంతో   ఎపుడూ తనతోనే ఉంచుకుంటూ వస్తున్నానని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇంద్రజాలం , క్రిస్టల్స్ పవర్ మీద ఆసక్తి పెరిగిందని తెలిపింది.

ఒక సందర్బంలో పాద మర్దన (రెఫ్లెక్సాలజీ) చేయించుకుంటున్న సందర్భంలో ఎవరో తన పాదాలమీద మెరుస్తున్న లైట్లు వేశారని,ఇది చాలా ఇబ్బందికరమైన అనుభూతికి దారితీసిందంది. ఇక ఆ తర్వాత బయటికొచ్చాక  గాల్లో నడుస్తున్నట్టుగా,   వీధుల్లో దుముకుతూ నడుస్తున్నట్టుగా, ఏదో మాయ ఆవహించినట్టుగా  అనిపించిందని తెలిపింది... అందుకే తాను హిప్పీలాగా ... మాంత్రికురాలిగా మారనున్నట్టు తనకు అర్థమైందని పేర్కొంది. దీంతోపాటుఇటీవలి  గ్రామీ అవార్డుల సందర్భంగా ఆ స్ఫటికాలను తీసుకెళ్లలేదని అందుకే అప్పటి తన ప్రదర్శన చాలా ఘోరంగా ఉందంటూ తన నమ్మకాన్ని సమర్ధించుకుంది. ఆ ఒక్కసారే వాటితో తీసుకెళ్ల లేకపోవడం వల్ల టెక్నికల్ సమస్యలు తలెత్తిన భయంకరమైన అనుభవాలను చవిచూశానని తెలిపింది.  

మరోవైపు ఈమెపై బ్రిటన్ లో ఓ బయోపిక్ కూడా రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాలో తన పాత్రను  కామెడీ యాక్టర్ పోషించనున్నారనే వార్తలు ఆమె ఖండించింది. తను కొంచెం లావుగా వుండడం వల్ల, బొద్దుగా  ఉన్ననటి  రెబెల్ విల్సన్  పెట్టారని దీనికి తన అనుమతి తీసుకోవాలని మండి పడి వార్తల్లో నిలిచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement