నాలుగు పుస్తకాలు రూ.24 కోట్లు! | Shakespeare's four folios fetch $3.6 mn at London auction | Sakshi
Sakshi News home page

నాలుగు పుస్తకాలు రూ.24 కోట్లు!

May 26 2016 9:41 AM | Updated on Sep 4 2017 12:59 AM

నాలుగు పుస్తకాలు రూ.24 కోట్లు!

నాలుగు పుస్తకాలు రూ.24 కోట్లు!

ఇంగ్లిష్ మహా నాటకకర్త, కవి విలియం షేక్‌స్పియర్ కు సంబంధించిన నాలుగు పుస్తకాలు వేలంలో రికార్డు ధరకు అమ్ముడు పోయాయి.

లండన్: ఇంగ్లిష్ మహా నాటకకర్త, కవి విలియం షేక్‌స్పియర్ కు సంబంధించిన నాలుగు పుస్తకాలు వేలంలో రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో సుమారు రూ. 24 కోట్ల(3.67 మిలియన్ డాలర్లు) ఈ పుస్తకాలకు అమెరికాకు చెందిన ప్రైవేటు సేకరణదారు దక్కించుకున్నారు.

ఇందులో మొదటి పుస్తకమే దాదాపు రూ. 17.5 కోట్లు(2.6 మిలియన్ డాలర్లు) పలికింది. రెండో పుస్తకం సుమారు 1.8 కోట్లు(2.8 లక్షల డాలర్లు), మూడో పుస్తకం దాదాపు రూ. 3.5 కోట్లు(5.33 లక్షల డాలర్లు), నాలుగో పుస్తకం రూ.47 లక్షలు(69,889 డాలర్లు) పలికాయని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement