సెల్‌ఫోన్‌ వాడకంతో యుక్తవయస్కులకు మెమొరీలాస్‌

Prolonged Smartphone Using Cause Memory Loss In Teens - Sakshi

బెర్నే : అతిగా సెల్‌ఫోన్‌ వాడే యుక్తవయస్కుల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువని అధ్యయనంలో తేలింది. మెదడు ఎక్కువగా రేడియేషన్‌కు గురికావటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని స్విట్జర్లాండ్‌కు చెందిన ‘‘స్విస్ ట్రాపికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్’ పరిశోధకుల బృందం తేల్చింది. యుక్తవయస్కులు ఎక్కువగా మొబైల్‌ ఫోన్లను, కంప్యూటర్లను  వాడటం వల్ల డిప్రెషన్‌, ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఎక్కువవుతుందని తెలిపారు. ఈ భావనలు ఎక్కువగా యువతులలో కలుగుతాయని పేర్కొన్నారు.

సెల్‌ఫోన్లను అతిగా వాడటం వల్ల వాటి నుంచి వెలువడే ‘‘రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమ్యాజ్నటిక్‌ ఫీల్ట్స్‌’’  తరంగాలు యుక్తవస్కులపై ఎక్కువ ప్రభావం చూపుతాయని వారు కనుగొన్నారు. సెల్‌ఫోన్లను తల కుడివైపు ఉంచి వాడటం వల్ల మెదడు కుడిభాగంలో కేంద్రీకృతమై ఉన్న ‘‘ఫిగరల్‌ మెమొరీ‘‘  దెబ్బతింటుందని వారు వెల్లడించారు. ఇయర్‌ ఫోన్స్‌ వాడకం వల్ల, ఫోన్‌లో మాట్లాడుతున్నపుడు స్పీకర్‌లో ఉంచటం ముఖ్యంగా మెసెజ్‌లు పంపుతున్నపుడు, గేమ్స్‌ ఆడుతున్నపుడు, ఇంటర్‌నెట్‌ వాడుతున్నపుడు రేడియేషన్‌ తక్కువగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top