అధికారులే షాకయ్యేలా అమ్మాయిలను.. | Private school boy, 16, 'sexually assaulted at least five female classmates | Sakshi
Sakshi News home page

అధికారులే షాకయ్యేలా అమ్మాయిలను..

Jul 29 2017 12:54 PM | Updated on Jul 23 2018 9:15 PM

అధికారులే షాకయ్యేలా అమ్మాయిలను.. - Sakshi

అధికారులే షాకయ్యేలా అమ్మాయిలను..

అతడి పేరు కానర్‌ టాట్రో. వయసు పదహారే. కానీ అతడు చేసిన పనులు వింటే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. చదువుకోసమని తల్లిదండ్రులు క్యాంపస్‌లో చేర్పిస్తే అది తప్ప మిగితా చెడుపనులన్నీ చేశాడు.

న్యూయార్క్‌: అతడి పేరు కానర్‌ టాట్రో. వయసు పదహారే. కానీ అతడు చేసిన పనులు వింటే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. చదువుకోసమని తల్లిదండ్రులు క్యాంపస్‌లో చేర్పిస్తే అది తప్ప మిగితా చెడుపనులన్నీ చేశాడు. క్లాసులు జరుగుతున్న సమయంలో క్లాస్‌లు ముగిసిన సమయంలో అతడికి అమ్మాయిల వెంటపడటం, ఏడిపించడమే పని.. అవకాశం దొరికినప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడటం. అంతేకాదు, ప్రత్యేకంగా తానే వ్యూహాలు పన్ని ఎటుట వెళ్లలేని పరిస్థితిని అమ్మాయిలకు సృష్టించి వారిని లోబర్చుకోవడం కూడా చేశాడు.

క్లాస్‌ రూముల్లో, బాత్‌ రూముల్లో, కేఫ్‌ టేరియాలో, స్కూల్‌ హాల్‌లోకి ప్రవేశించే మార్గాల్లో, బేస్‌ బాల్‌ మైదానాల్లో, క్యాంపస్‌ పరిధిలోని చెట్లు, పొదలు ఉన్న ప్రాంతాల్లో అతడి దుశ్చేష్టలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. పలువురు అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అతడు ఐదుగురు అమ్మాయిలపై మాత్రం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒకమ్మాయినైతే తన శృంగారానికి ఒప్పుకోలేదని తీవ్రంగా గాయపరిచాడు. ఎట్టకేలకు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు అతడు తప్పిదాలకు పాల్పడిన విధానం చూసి షాకయ్యారు.

హర్రర్‌ చిత్రాల్లో ఓ సైకో మాదిరిగా పదహారేళ్లకే అతడు ప్రతీది పక్కా ప్లాన్‌ ప్రకారం చేసిన పనిని చూసి బిత్తరపోయారు. దీంతో ఎట్టకేలకు కోర్టు అతడిని దోషిగా పేర్కొంది. కానర్‌ టాట్రోను అతడి తల్లిదండ్రులు థెట్ఫోర్డ్‌ అకాడమీలో చేర్పించారు. అయితే, అకాడమీలో చేరిన అతడు 15 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలనే టార్గెట్‌ చేసుకొని లైంగికదాడులు చేయడం మొదలు పెట్టాడు. దీంతో ఈ కేసును విచారణ చేపట్టిన కోర్టు ఈ కేసు చాలా సీరియస్‌ అంటూ వర్మోంట్‌ సుపీరియర్‌ కోర్టు అభివర్ణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement