రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు ఐవరీ కోస్ట్ తమ దేశ అత్యున్నత పురస్కారం కోట్ డీ ఐవరీని ప్రధానం చేసింది.
అబిద్ జాన్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు ఐవరీ కోస్ట్ తమ దేశ అత్యున్నత పురస్కారం కోట్ డీ ఐవరీని ప్రధానం చేసింది. మూడు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా బుధవారం అబిద్ జాన్ నగరానికి వెళ్లిన రాష్ట్రపతికి ఆ దేశాధ్యక్షుడు అలస్సానే ఒట్టారా దేశ అత్యున్నత పురస్కారం తో సత్కరించారు. కాగా, ప్రపంచ దేశాల నుంచి ఎన్నో డిగ్రీలను అందుకున్న ప్రణబ్ ఒక దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. ఐవరీ కోస్ట్ అత్యున్నత పురస్కారంపై మాట్లాడిన ప్రణబ్ ఒక దేశ అత్యున్నత పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
యూఎన్, ప్రపంచవేదికలపై సహకరించుకునేందుకు ఈ పర్యటనలో ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. టెర్రరిజంపై పోరాడేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని వివరించారు. ప్రస్తుతం ఇరుదేశాలు7-9 శాతం అభివృద్ధితో ముందుకు దూసుకుపోతున్నాయని అన్నారు. రానున్న సంవత్సరాల్లో ఇరుదేశాల మధ్య ఒక బిలియన్ డాలర్ల వ్యాపారాలు జరుతాయని తెలిపారు.