ఇండోనేషియాలో భూకంపం | Powerful 6.5 earthquake strikes Indonesia: USGS | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో భూకంపం

Feb 12 2016 5:17 PM | Updated on Aug 24 2018 7:34 PM

ఇండోనేషియాలో భూకంపం - Sakshi

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదు అయింది.

జకార్తా:  ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇంతవరకు ప్రాణ, ఆస్తి నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది.

అయితే భూకంపంపై సమాచారం అందిన వెంటనే ఇండినేషియా విపత్తు నివారణ సంస్థకు చెందిన బృందాలు ఇప్పటికే సదరు ప్రాంతాల్లో తరలించి సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పింది.  కాగా సునామీ వచ్చే అవకాశం మాత్రం లేదని పేర్కొంది. సుంబా ప్రాంతంలో 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement