డొనాల్డ్ ట్రంప్ క్రిస్టియన్ కాదు! | Pope says Donald Trump 'is not Christian' | Sakshi
Sakshi News home page

డొనాల్డ్ ట్రంప్ క్రిస్టియన్ కాదు!

Feb 19 2016 9:47 AM | Updated on Apr 4 2019 3:25 PM

డొనాల్డ్ ట్రంప్ క్రిస్టియన్ కాదు! - Sakshi

డొనాల్డ్ ట్రంప్ క్రిస్టియన్ కాదు!

అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున ముందు వరసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మెక్సికో సిటీ: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున ముందు వరసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెక్సికో, అమెరికాల మధ్య గోడను నిర్మించాలని, మెక్సికన్ అక్రమ వలసదారులను వెనక్కి పంపాలని  డొనాల్డ్ ట్రంప్ కోరుతున్న నేపథ్యంలో..'కేవలం గోడలను మాత్రమే నిర్మించాలనుకునే వ్యక్తి వారధులను నిర్మించలేడు. అలాంటి వారు అసలు క్రిస్టియన్ కాదు' అని పోప్ వ్యాఖ్యానించారు. అలాగే, అమెరికా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని పరిష్కరించాలన్న పోప్.. తాను అమెరికన్ క్యాథలిక్లకు ట్రంప్కు ఓటు వేయొద్దని చెప్పడం లేదన్నారు.

దీనిపై వెంటనే స్పందించిన ట్రంప్.. పోప్ వ్యాఖ్యలు అవమానకరమైనవిగా పేర్కొన్నారు. 'ఓ వ్యక్తి మతం లేదా విశ్వాసాల గురించి మాట్లాడే హక్కు ఏ నాయకుడికి ముఖ్యంగా మత నాయకుడికి లేదు' అన్నారు. ఒకవేళ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అంతిమ లక్ష్యం అయిన వాటికన్ సిటీపై దాడి జరిపితే అప్పుడు ట్రంపే ప్రెసిడెంట్ కావాలని పోప్ ప్రార్థించేవారన్నారు. పోప్కు ఒకవైపు మాత్రమే తెలుసు అని అమెరికాలోని నేరాలు, మదక ద్రవ్య అక్రమ రవాణా, ప్రతికూల ఆర్ధిక ప్రభావం తదితర అంశాలను ఆయన చూడలేదని ట్రంప్ విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement