లయన్‌ విమాన ప‍్రమాదం : కెప్టెన్‌గా ఢిల్లీ వాసి

Pilot of crashed Indonesian Lion Air was a 31-year-old from Delhi - Sakshi

కూలిపోయిన లయన్‌ విమానం పైలట్‌ ఢిల్లీ వాసి భవ్యే సునేజా

2009లో పైలట్‌ లైసెన్స్‌

2011లో లయన్‌ సంస్థలో పైలట్‌గా చేరిన భవ్యే సునేజా

ఇండోనేషియాలో ఘోర ప్రమాద వార్త విన్న వెంటనే  భారతీయులంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ప్రమాదంలో భారతీయులెవరూ ఉండకూదంటూ సోషల్‌ ​మీడియాలో చాలామంది  ప్రార్థించారు. కానీ వారు భయపడినంతా జరిగింది.  ముఖ్యంగా న్యూఢిల్లీకి చెందిన  భవ్యే సునేజా (31)  ప్రమాదానికి  గురైన లయన్‌ విమానానికి  కెప్టెన్‌ పైలట్‌గా  ఉన్నారు. ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ ప్రాంతానికి చెందిన  సునేజా 2009లో పైలట్‌  లైసెన్స్‌ పొందారు.  ఎమిరేట్స్‌, కాలిఫోర్నియాలో పైలట్‌ శిక్షణ పొందారు.  2011లో లయన్‌ ఎయిర్‌ సంస్థలో పైలట్‌గా చేరారు. సునేజా భార్య ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో  మేనేజరుగా  పనిచేశారుట.

సునేజా జులైలో ఢిల్లీలో పోస్టింగ్‌ ఇప్పించాలని కోరారు. చాలా అనుభవమున్న పైలట్‌. నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టే అతన్ని ఇండోనేసియా సంస్థలోనే ఉంచాలనుకున్నామని లయన్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. తమసంస్థలో పనిచేసే పైలట్లంతా ఉత్తర భారత్‌కు చెందినవారే.  సునేజా అభ్యర్ధనను వెంటనే అంగీకరించలేకపోయామంటూ  లయన్‌ ఎయిర్‌ అధికారులు వెల్లడించారు.

కాగా ఇండోనేషియా విమానం బెలిటంగ్ దీవులలోప్రధాన నగరమైన పంకకల్ పినాంగ్‌కు బయలుదేరిన లయన్‌ జెట్‌పాసింజర్‌( జేటీ-610 )విమానంలో  సముద్రంలో 30-30మీటర్ల లోతులో సోమవారం ఉదయం  కూలిపోయింది.  ఇద్దరు పైలట్లు, అయిదుగురు సిబ్బంది సహా సుమారు 188 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదలో ఎవరూ బతికి వుండే అవకాశం లేదని అధికారులు  ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top