భారతీయులను రెచ్చగొడుతూ.. మోర్గాన్ మరో ట్వీట్ | piers morgan tweets again to mock indian twitteratti | Sakshi
Sakshi News home page

భారతీయులను రెచ్చగొడుతూ.. మోర్గాన్ మరో ట్వీట్

Aug 26 2016 2:22 PM | Updated on Sep 4 2017 11:01 AM

భారతీయులను రెచ్చగొడుతూ.. మోర్గాన్ మరో ట్వీట్

భారతీయులను రెచ్చగొడుతూ.. మోర్గాన్ మరో ట్వీట్

భారతీయ ఫ్యాన్లను రెచ్చగొట్టే అలవాటును బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ ఇంకా వదులుకోలేదు.

భారతీయ ఫ్యాన్లను రెచ్చగొట్టే అలవాటును బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ ఇంకా వదులుకోలేదు. రియో ఒలింపిక్స్‌లో భారతదేశానికి రెండే పతకాలు వచ్చినా సంబరాలు ఎందుకు చేస్తున్నారంటూ ట్వీట్ చేసినప్పటి నుంచి ఆయన ట్రెండ్ అవుతున్నారు. ఆయన ఆ ట్వీట్ చేసిన వెంటనే వేలాది మంది భారతీయులు మోర్గాన్ మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. చివరకు భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మోర్గాన్‌ను తీవ్రంగా ఖండించాడు. తనదైన శైలిలో ప్రతివిమర్శలు చేశాడు.

ఇక వివాదం అంతా సర్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలో మోర్గాన్ మరోసారి మొదలుపెట్టాడు. ''ఇండియన్ ట్విట్టర్, ఎందుకు సైలెంటుగా ఉన్నారు.. మీ గాయాలకు మందులు పూసుకుంటున్నారా'' అంటూ రెచ్చగొట్టేలా మరో ట్వీట్ పెట్టాడు. దాంతోపాటు ఒక్కరోజులో తన ఫాలోవర్ల సంఖ్య 12వేలు పెరిగిందని, దీనంతటికీ కారణం భారతీయ అభిమానులేనంటూ వారికి థాంక్స్ చెప్పాడు. మోర్గాన్ ఇలా రెచ్చగొట్టాక భారతీయులు ఏమంటారో ఇక చూడాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement