
పాములా పాకేస్తుంది..
మీరు చూస్తున్నది నిజమే.. ఆ బిల్డింగ్ మీద ఉన్నవి రైళ్లే!! ఇది భవిష్యత్తు రైల్వే స్టేషన్ ఊహా చిత్రం. అంటే.. రైళ్లు ఇలా నిలువుగా ఆకాశహర్మ్యం మీదకు ఎక్కేస్తాయన్నమాట.
మీరు చూస్తున్నది నిజమే.. ఆ బిల్డింగ్ మీద ఉన్నవి రైళ్లే!! ఇది భవిష్యత్తు రైల్వే స్టేషన్ ఊహా చిత్రం. అంటే.. రైళ్లు ఇలా నిలువుగా ఆకాశహర్మ్యం మీదకు ఎక్కేస్తాయన్నమాట. ఇలాంటి స్టేషన్ల నిర్మాణం వల్ల స్థలం వంటివి ఆదా కూడా అవుతుంది. హైపర్ స్పీడ్ వర్టికల్ ట్రెయిన్ హబ్‌గా పిలుస్తున్న ఈ డిజైన్‌ను లండన్‌కు చెందిన క్రిస్టోఫర్, లుకాస్ మజరసాలు తయారుచేశారు. 2075 నాటికి నగరాలు ఎదుర్కొనే సమస్యలకు ఇది చెక్ పెడుతుందని.. భవిష్యత్తు రవాణా వ్యవస్థగా ఎదుగుతుందని వీరు చెబుతున్నారు. ఈ ఆకాశహర్మ్యంలో రైల్వే స్టేషన్‌తోపాటు మిగిలిన ఆఫీసులూ ఉంటాయి.
ఈ హైపర్ ట్రెయిన్‌లు భూగర్భంలోనూ.. పైన వెళ్తాయి. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఇంతకీ రైళ్లు ఈ బిల్డింగ్ మీదకు ఎలా ఎక్కుతాయన్నదే కదా మీ డౌట్.. ఈ రైలు బోగీలు జెయింట్ వీల్ తరహాలో బిల్డింగ్ మీదకు ఎక్కుతాయట. ఈ బిల్డింగ్‌కు రెండువైపులా ఉండే.. భారీ అయస్కాంతాలు రైలు.. భవనం పైకి ఎక్కేలా చేస్తాయి. బోగీలను ఎక్కడికక్కడ పట్టి ఉంచుతాయన్నమాట.