ట్విట్టర్ ఆక్రోశం | Paris attacks: Celebs across the globe express grief, horror | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ ఆక్రోశం

Nov 14 2015 11:42 AM | Updated on Sep 3 2017 12:29 PM

ట్విట్టర్  ఆక్రోశం

ట్విట్టర్ ఆక్రోశం

ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా టాలీవుడ్, బాలీవుడ్ నటులు, గాయకులు, వివిధ రంగాల ప్రముఖులు ట్విట్టర్ లో స్పందించారు.

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని వణికిస్తోంది.  ఆ నగరంలో పలు చోట్ల సంభవించిన దాడుల్లో  ఇప్పటికే 150 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల ఆర్తనాదాలు, క్షతగాత్రుల హాహాకారాలతో పారిస్ నగరం చివురుటాకులా వణికింది. ఈ దాడిని ప్రపంచదేశాల నాయకులు ముక్తం కంఠంతో ఖండించారు. కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఆకాంక్షించారు. ఈ  నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్ నటులు, గాయకులు, వివిధ రంగాల ప్రముఖులు ట్విట్టర్ లో స్పందించారు. ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించిన పలువురు సెలబ్రిటీలు మృతులకు తీవ్ర సంతాపాన్ని  ప్రకటించారు. పారిస్‌లో తమ బంధువులు, సన్నిహితుల క్షేమం కోసం  ఆరా తీశామన్నారు.  శాంతి సందేశాలను,  ఫొటోలను షేర్ చేశారు.

బాలీవుడ్ నటీ నటులు, అనుపమ్ ఖేర్,  హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా,  కేటీ పెర్రీ, నమ్రత్  కౌర్, అక్షయ్ కుమార్, అలియాభట్, తాప్సీ, క్రిస్  రాక్,  నీల్ నితిన్ ముఖేష్ , ప్రాచీ దేశాయ్ తదితరులు ట్విట్టర్ లో తమ సందేశాలను పోస్ట్  చేశారు. ప్రే ఫర్ పారిస్ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement