పాక్‌ క్షిపణి ప్రయోగం విఫలం | Pakistan 750km Range Missile Crashes | Sakshi
Sakshi News home page

పాక్‌ క్షిపణి ప్రయోగం విఫలం

Mar 23 2020 9:07 AM | Updated on Mar 23 2020 9:27 AM

Pakistan 750km Range Missile Crashes - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ క్షిపణి ప్రయోగం మరోసారి విఫలమైంది. బెలుచిస్తాన్‌లో సోన్‌మియానీ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ప్రయోగించిన బాబర్‌ 2 క్షిపణి ప్రయోగం విఫలమైంది. ఈ క్షిపణిని ఉపరితలం నుంచి 750కిలోమీటర్లు నింగికి ప్రయాణించే లక్ష్యంగా రూపొందించారు. కాగా, బాబర్‌ 2 క్రూయిజ్‌ క్షిపణి కేవలం రెండు నిమిషాలు మాత్రమే నింగిపై ప్రయాణించి నేలపై కుప్పకూలింది. గత ఏప్రిల్‌లో పాక్‌ ప్రయోగించిన బాబర్‌ 2 సబ్‌ సోనిక్‌ క్షిపణి ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే.

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన నిర్బయ్‌ ప్రయోగానికి దీటుగా పాక్‌ చైనాతో కలిసి క్షిపణి ప్రయోగానికి సిద్దమైందని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్‌కు వైఫల్యాలతో పాటు క్షిపణి ప్రయాగాలలో కొన్ని విజయవంతమయ్యాయి. ఫిబ్రవరి 2020లో అణుసామర్థ్యం గల క్రూయిజ్‌ క్షిపణి రాద్‌–2ను 600 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించి విజయం సాధించింది. ఈ ప్రయోగం భూమిపై, సముద్రంలో సైనిక ‘నియంత్రణ సామర్థ్యం’ను పెంచిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement