పాక్లో పెరుగుతున్న హెచ్ఐవీ రోగులు | Over 900 new HIV cases in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్లో పెరుగుతున్న హెచ్ఐవీ రోగులు

Nov 28 2014 12:48 PM | Updated on Sep 2 2017 5:17 PM

పాకిస్థాన్లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజూరోజుకు పెరుగుతుంది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజూరోజుకు పెరుగుతుంది. పాక్లోని సింధు ప్రావెన్స్లోని తాజాగా 994 మంది ఎయిడ్స్ రోగులను గుర్తించినట్లు ఎయిడ్స్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సికిందర్ అలీ షా వెల్లడించారు. సింధూ ప్రావెన్స్లో ఇటీవల ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 994 మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారని ఆయన చెప్పారు.


వ్యాధిగ్రస్తుల్లో 905 మంది మగవారు, 83 మంది మహిళలు,  మిగిలిన ఆరుగురి చిన్నారులేనని... వారిలో నలుగురు బాలురు, ఇద్దరు
బాలికలు ఉన్నారని వివరించారు.  ఈ ఆరుగురి వయస్సు ఏడేళ్లలోపేనని చెప్పారు. 2003 నుంచి ఇప్పటి వరకు ఏయిడ్స్ వ్యాధితో 265 మంది మరణించారని... ఈ ఒక్క ఏడాదే 29 మంది కన్నుమూశారని అలీ షా విశదీకరించారు. ఈ మేరకు శుక్రవారం మీడియా
వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement