సెక్స్ మార్చుకున్నా.. 'ఆమె'లా ఉండలేను! | Oregon court allows Jamie Shupe to change sex from female to nonbinary | Sakshi
Sakshi News home page

సెక్స్ మార్చుకున్నా.. 'ఆమె'లా ఉండలేను!

Jun 11 2016 3:27 PM | Updated on Jul 23 2018 9:11 PM

సెక్స్ మార్చుకున్నా.. 'ఆమె'లా ఉండలేను! - Sakshi

సెక్స్ మార్చుకున్నా.. 'ఆమె'లా ఉండలేను!

పురుషుడిగా పుట్టి, మహిళగా లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తిని ఏమని పిలుస్తారు?.. అయితే మహిళ అనో లేక ట్రాన్స్ జెండర్ అనో పిలుస్తారు. కానీ నన్నలా పిలవొద్దంటూ ఏకంగా కోర్టు మెట్లెక్కింది జామి షుపె.

పురుషుడిగా పుట్టి, మహిళగా లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తిని ఏమని పిలుస్తారు?.. అయితే మహిళ అనో లేక ట్రాన్స్ జెండర్ అనో పిలుస్తారు. కానీ నన్నలా పిలవొద్దంటూ ఏకంగా కోర్టు మెట్లెక్కింది జామి షుపె. అమెరికాలోని ఆరెగాన్ రాష్ట్రానికి చెందిన ఈమె.. తనను స్త్రీగాకానీ, పురుషుడిగాకానీ సంబోధించవద్దని ఆమేరకు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పూర్తిగా కొత్త తరహాదైన ఈ కేసు చిక్కుముడి విప్పడానికి న్యాయమూర్తి చట్టాలన్నింటినీ తిరగేయాల్సి వచ్చింది. చివరకు శుక్రవారం తుది తీర్పును చదివి వినిపిస్తూ.. 'ఎలాంటి అభ్యంతరం లేనందున సదరు జామిని నాన్ బైనరీగా పరిగణించాలి' అని జడ్జిగారు ఆదేశించారు. ఒకప్పుడు మగాడిగా ఆర్మీలో పనిచేసిన జామికి కోర్టు తీర్పు ఊరటనిచ్చింది.

అమెరికన్ ఆర్మీలో ఫస్ట్ క్లాస్ సార్జెంట్ గా పనిచేసి, 2010లో రిటైర్మెంట్ తీసుకున్న షుపె.. 2013లో సెక్స్ మార్పిడి చేయుంచుకుని మహిళగా మారిపోయాడు. అయితే తనలో ఆడామగా లక్షణాలు ఉన్నందున తనను ఏదోఒక లింగానికి పరిమితం చేయరాదంటూ కోర్టుకు ఆర్జీ పెట్టుకున్నాడు. ఆరెగాన్ కోర్టులు సెక్స్ మార్పిడి చేయించుకున్నవాళ్లకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించడం సమజమే అయినా, జామి అభ్యర్థన మాత్రం కొత్త తరహాది. దీంతో కాస్త సమయం తీసుకున్న న్యాయమూర్తులు ఆమెను ఆడామగా కాని నాన్ బైనరీగా గుర్తించాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, పాస్ పోర్టులోనూ ఆమేరకు మార్పులు చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. భలే ఉందికదా ఈ జంబలకడిపంబ కథనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement