
మీ కుక్కతో సెల్ఫీ ఇక ఈజీ!
మీ పెంపుడు కుక్కతో సెల్ఫీ తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారా? వాటిని అధిగమించేందుకు కాలిఫోర్నియాకు చెందిన జోసన్ హెర్నాండేజ్ ఓ పరిష్కారాన్ని కనిపెట్టాడు.
లాస్‌ఏంజెలిస్: మీ పెంపుడు కుక్కతో సెల్ఫీ తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారా? వాటిని అధిగమించేందుకు కాలిఫోర్నియాకు చెందిన జోసన్ హెర్నాండేజ్ ఓ పరిష్కారాన్ని కనిపెట్టాడు. స్మార్ట్‌ఫోన్‌కు టెన్నిస్‌బాల్‌ను అతికించడం ద్వారా కుక్కలతో సెల్ఫీలు తీసుకోవడం సులువవుతుందని వెల్లడించాడు. పెంపుడు కుక్కతో తన భార్య సెల్ఫీ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసిన హెర్నాండేజ్ ఎలాగైనా ఈ సమస్యను అధిగమించాలని ఏడాదిపాటు శ్రమించి ఈ టెక్నిక్‌ను కనిపెట్టాడు. ఈ విధానంలో సెల్ఫీ తీసుకునేటప్పుడు కుక్క ఏకాగ్రత అంతా టెన్నిస్ బాల్ (పోచ్ సెల్ఫీబాల్)పైనే ఉంటుంది.
కాబట్టి అది కదలకుండా కెమెరా వంకే చూస్తుంది. అంతే కాదు, ఈ పోచ్ సెల్ఫీ బాల్ నుంచి శబ్దాలు కూడా వస్తాయి. అవి కుక్క ఏకాగ్రతను రెట్టింపు చేస్తాయి. దీంతో నిస్సందేహంగా ఫొటోలు తీసుకోవచ్చని అంటున్నాడు. ఈ పోచ్ బాల్‌ను అన్ని స్మార్ట్‌ఫోన్ల్లకు సరిపోయేలా అభివృద్ధి చేస్తున్నాడు. ‘కిక్‌స్టార్టర్’ అనే కంపెనీ దీనికి అవసరమైన ప్రత్యేకనిధిని సమకూర్చుకునేందుకు విరాళాల సేకరణ చేపట్టింది. దీని లక్ష్యం 7వేల డాలర్లు కాగా, 14వేల డాలర్లకుపైగా విరాళాలు వసూలు కావడం గమనార్హం.