ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష | North Korea conducts another missile test | Sakshi
Sakshi News home page

ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష

May 15 2017 1:07 AM | Updated on Sep 5 2017 11:09 AM

ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష

ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష

అణు బాంబు వేస్తామంటూ అమెరికాను భయపెడుతున్న ఉత్తర కొరియా ఆదివారం ఖండాం తర క్షిపణిని పరీక్షించింది.

సియోల్‌: అణు బాంబు వేస్తామంటూ అమెరికాను భయపెడుతున్న ఉత్తర కొరియా ఆదివారం ఖండాం తర క్షిపణిని పరీక్షించింది. క్షిపణి సుమారు 800 కి.మీ. ప్రయాణించి  జపాన్‌కు సమీపంలోని సముద్ర జలాల్లో పడింది.

ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్, అమెరికా మిలటరీ బృందం స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రయోగంతో ఇటీవల ఎన్నికైన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌తో పాటు పసిఫిక్‌ మహా సముద్రంలో  మోహరించిన జపాన్, అమెరికా, యూరప్‌ నౌకా దళాలకు ఉత్తర కొరియా సవాల్‌ విసిరింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షపై జపాన్‌ అధ్యక్షుడు షింజో అబే మాట్లాడుతూ.. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement