ఇక ‘అణు’ కిమ్‌ కాదు..!!

No More Nuclear Tests Says North Korea - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌, ఉత్తరకొరియా : అణు పరీక్షలను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉత్తరకొరియా ప్రకటించింది. అమెరికా, దక్షిణకొరియాలతో చర్చల అనంతరం ఉత్తరకొరియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గతేడాది కిమ్‌ జాంగ్‌ ఉన్‌ వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను హడలెత్తించిన విషయం తెలిసిందే. వింటర్‌ ఒలింపిక్స్‌ నుంచి ఉత్తరకొరియా అధ్యక్షుడు క్రమంగా ఉద్రేకమైన వ్యాఖ్యలను తగ్గిస్తూ వచ్చారు.

రహస్యంగా చైనాలో పర్యటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు కూడా. అనంతరం దక్షిణ కొరియా అధికారుల బృందం ప్యాంగ్‌యాంగ్‌ వేదికగా కిమ్‌ను కలుసుకుంది. వారితో అణు పరీక్షల నిలిపివేతకు సంసిద్ధతను కిమ్‌ వ్యక్తం చేశారు.

దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరకొరియా తాజా ప్రకటనపై ట్రంప్‌ తాను చాలా మంచి వార్త విన్నానని అన్నారు. కాగా, మే నెలలో ట్రంప్‌-కిమ్‌లు సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top