అప్పుడే పుట్టిన క‌వ‌ల‌ల‌కు సోకిన క‌రోనా | Newborn Triplets Test Corona positive In Mexico | Sakshi
Sakshi News home page

అప్పుడే పుట్టిన క‌వ‌ల‌ల‌కు సోకిన క‌రోనా

Jun 24 2020 2:56 PM | Updated on Jun 24 2020 3:10 PM

Newborn  Triplets Test  Corona positive In Mexico - Sakshi

మెక్సికో : అప్పుడే పుట్టిన న‌వ‌జాత క‌వ‌ల‌ల‌కు క‌రోనా సోకిన‌ ఘ‌ట‌న మెక్సికోలో చోటుచేసుకుంది. త‌ల్లితో పాటు ముగ్గురు క‌వ‌ల‌పిల్ల‌ల‌కు కూడా వైర‌స్ సోకింద‌ని వైద్యులు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. క‌వ‌ల‌ల్లో ఇద్ద‌రు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టిన‌ట్లు తెలిపారు. అయితే వీరిలో ఓ అబ్బ‌యి మాత్రం శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందు ప‌డుతున్నాడ‌ని ప్ర‌స్తుతం అత‌నికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. (వినూత్నంగా యోగా! )

అయితే అప్పుడే పుట్టిన పిల్ల‌ల‌కు క‌రోనా సోక‌డం చాలా అరుదైన సంఘ‌ట‌న అని రాష్ట్ర ఆరోగ్య భద్రతా కమిటీ ప్రతినిధి తెలిపారు. అయితే త‌ల్లి గ‌ర్భిణీగా ఉన్న స‌మ‌యంలోనే కోవిడ్‌కు గురై త‌ద్వారా పిల్ల‌ల‌కు సంక్ర‌మించి ఉండొచ్చ‌ని ప్రాధ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. మెక్సికోలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 1,85,00 కు చేరుకోగా 22,584 మంది మృత్యువాత ప‌డ్డారు. ఫిబ్ర‌వ‌రి 28న మెక్సికోలో తొలి క‌రోనా కేసు బ‌య‌ట‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. (నేపాల్‌ భూభాగాన్ని ఆక్రమించిన చైనా! )


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement