పిప్పి పళ్లకు గుడ్‌బై? 

New Solution to Dental Problems - Sakshi

పిప్పి పళ్ల సమస్య ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే.. యూనివర్సిటీ ఆఫ్‌ ప్లైమౌత్‌ శాస్త్రవేత్తలు పిప్పి పళ్లను నయం చేయగల మూలకణాలను ఎలుకల్లో గుర్తించారు.. కాబట్టి.. సరైన పంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే కొంతకాలానికి చెడు బ్యాక్టీరియా చేరిపోయి పిప్పి పళ్లు వస్తాయని తెలిసిన విషయమే.. దురదృష్టవశాత్తూ ఈ పిప్పి పళ్లు ఏర్పడే ప్రాంతంలో డెంటిన్‌ను శరీరం తయారు చేసుకోలేదు. కానీ.. ఎలుకలు దీనికి భిన్నం. ముందు పళ్లు ఎన్నిసార్లు ఊడినా మళ్లీ పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్లైమౌత్‌ యూని వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు జరిపి.. ఎలుకలకు ఉన్న ఈ లక్షణానికి వాటి కం డరాల్లో, ఎముకల్లో ఉండే ప్రత్యేకమైన మూలకణాలు కారణమని తేల్చారు. ఈ మూలకణాలు డెంటిన్‌ ఉత్పత్తి చేయడంతో పాటు డీఎల్‌కే–1 అనే జన్యువు ద్వారా ఎన్ని కొత్త కణాలు పుట్టా లో కూడా నియంత్రిస్తున్నట్లు పరిశోధనల ద్వా రా తెలిసింది. డీఎల్‌కే1 జన్యువు కూడా పంటి కణజాలం పెరుగుదలలో, గాయాలను మాన్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ మూల కణాలు మానవుల పంటిలో ఉన్నాయా అనే విషయం ఇంకా తెలుసుకోవాల్సి ఉందని డీఎల్‌కే–1 వంటి జన్యువే మన పంటి పెరుగుదలను నియంత్రిస్తోందా అనేది కూడా చూడాలని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బింగ్‌ హూ తెలిపారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top