
నేపాల్ ప్రధాని రాజీనామా!
నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా రాజీనామా చేయనున్నారు.
కట్మాండు: నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఆ దేశ పార్లమెంట్లోనే ప్రకటించేశారు. మరికాసేపట్లో రాష్ట్రపతి రామ్ బరన్ యాదవ్కి తన రాజీనామా లేఖను సుశీల్ కొయిరాలా ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 20న ఆదేశం కొత్త రాజ్యాంగాన్ని అమలుచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నూతన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను ఎన్నుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి పార్లమెంట్ సమావేశంలో పేర్కొన్నారు.
నూతన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం, నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి సన్నద్ధమవ్వాలని మంత్రి లాల్ బాబు పండిత్ అన్నారు. సమావేశాలు ప్రారంభమైన వారం రోజుల్లోగా ప్రధాని నియామకం, 20 రోజుల్లోగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉపరాష్ట్రపతి నియామకాలు జరగాల్సి ఉందన్నారు.