సృష్టి స్తంభాలు కరుగుతున్నాయి! | NASA stuns with new image of 'Pillars of Creation' | Sakshi
Sakshi News home page

సృష్టి స్తంభాలు కరుగుతున్నాయి!

Jan 9 2015 4:43 AM | Updated on Sep 2 2017 7:24 PM

సృష్టి స్తంభాలు కరుగుతున్నాయి!

సృష్టి స్తంభాలు కరుగుతున్నాయి!

నక్షత్రాలకు జన్మనిచ్చే అతిశీతల నక్షత్ర ధూళి మేఘాలివి. మనకు 7 వేల కాంతి సంవత్సరాల దూరంలోని సెర్పెన్స్(పాము) నక్షత్రమండలంలో ఉన్నాయి.

అతిశీతల నక్షత్ర ధూళి, నక్షత్రమండలం, హబుల్ అంతరిక్ష టెలిస్కోపు
నక్షత్రాలకు జన్మనిచ్చే అతిశీతల నక్షత్ర ధూళి మేఘాలివి. మనకు 7 వేల కాంతి సంవత్సరాల దూరంలోని సెర్పెన్స్(పాము) నక్షత్రమండలంలో ఉన్నాయి. ఈగల్ నెబ్యులా (నక్షత్ర ధూళి మేఘాల సమూహం)లో భాగంగా ఉన్న ఈ సృష్టి స్తంభాలను అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థలు నాసా, ఈసాలకు చెందిన హబుల్ అంతరిక్ష టెలిస్కోపు తొలిసారిగా 1995లో ఫొటోలు తీసిం ది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఇటీవల మరోసారి ఫొటోలు తీసింది.

దీంతో ఈ సృష్టి స్తంభాలు కొన్నిచోట్ల కరుగుతున్నాయని వెల్లడైంది. హైడ్రోజన్, హీలియం వాయువులు, ధూళితో తారలను సృష్టించే స్తంభాల్లా ఉన్నం దున వీటికి ‘పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్’ అని పేరు పెట్టారు. అయితే, కొత్తగా పుట్టిన నక్షత్రాల వేడి వల్ల వీటిలోని వాయువులు వేడెక్కి.. ఆవిరై అంతరిక్షంలోకి విడుదలవుతున్నాయని తాజాగా  శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement