మేడమ్ టుస్సాడ్స్‌లో మోదీ విగ్రహం | Narendra Modi's wax statue unveiled at Madame Tussaud's Musuem | Sakshi
Sakshi News home page

మేడమ్ టుస్సాడ్స్‌లో మోదీ విగ్రహం

Apr 29 2016 4:36 AM | Updated on Aug 24 2018 2:17 PM

మేడమ్ టుస్సాడ్స్‌లో మోదీ విగ్రహం - Sakshi

మేడమ్ టుస్సాడ్స్‌లో మోదీ విగ్రహం

మైనపు విగ్రహాల ప్రదర్శనశాల మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు.

లండన్: మైనపు విగ్రహాల ప్రదర్శనశాల మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. దీన్ని ఢిల్లీలో గతవారమే మోదీ పరీక్షించారు. విఖ్యాత నాయకుల విభాగంలో మోదీ విగ్రహానికి స్థానం కల్పించారు. ఈ విభాగంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తదితరుల విగ్రహాలు ఇప్పటికే కొలువుదీరి ఉన్నాయి. వీరితోపాటు పాతతరం నాయకులు మహాత్మా గాంధీ, విన్‌స్టన్ చర్చిల్‌ల మైనపు ప్రతిమలూ ఇక్కడ ఉన్నాయి. లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్‌ల్లోని మేడమ్ టుస్సాడ్స్ ప్రదర్శనశాలల్లోనూ మోదీ విగ్రహాలను ఉంచుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement