సెకనులో రెండు సినిమాలు | Nanocrystal Perovskite Material Shows Potential for Laser-based VLC Tranmission of Up to 2 Gbps | Sakshi
Sakshi News home page

సెకనులో రెండు సినిమాలు

Aug 16 2016 12:59 PM | Updated on Sep 4 2017 9:31 AM

సెకనులో రెండు సినిమాలు

సెకనులో రెండు సినిమాలు

ఒక్క సెకన్లోనే రెండు సినిమాలు డౌన్లోడ్ అయిపోతే... హైడెఫినేషన్ వీడియోలు కూడా వేగంగా ప్లే అయితే... భలేగా ఉంటుంది.

జడ్దా: ఒక్క సెకన్లోనే రెండు సినిమాలు డౌన్లోడ్ అయిపోతే... హైడెఫినేషన్ వీడియోలు కూడా వేగంగా ప్లే అయితే... భలేగా ఉంటుంది కదా... అలాంటి అధునాతన వైర్లెస్ సాంకేతిక పరిజ్ఞానానికి తోడ్పడే సరికొత్త పదార్థాన్ని సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

వారు తయారు చేసిన నానోక్రిస్టలిన్ పదార్థం, నీలి రంగు కాంతి నుంచి స్పష్టమైన తెలుపు కాంతిని వేరు చేయగలదని...దాని సహాయంతో 2 జీబీపీఎస్ (సెకనుకు రెండు గిగాబైట్లు) వేగంతో సమాచారాన్ని ప్రసారం చేయవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ పరికరాల మధ్య సమాచార మార్పిడికి వివిధ రకాలైన విద్యుదాయస్కాంత తరంగాలను వినియోగిస్తున్నారు. దాంతో పోలిస్తే కాంతి ఆధారిత సమచార మార్పిడి వేగవంతంగా ఉంటుంది.

Advertisement

పోల్

Advertisement