ఫ్లూ టీకా ఉదయమే మేలు | Morning itself good to the flu vaccine | Sakshi
Sakshi News home page

ఫ్లూ టీకా ఉదయమే మేలు

Apr 27 2016 1:15 AM | Updated on Sep 3 2017 10:49 PM

ఫ్లూ టీకా ఉదయమే మేలు

ఫ్లూ టీకా ఉదయమే మేలు

ఫ్లూ వ్యాక్సిన్లు ఉదయం పూట వాడినప్పుడు ఎక్కువ క్రియాశీలకంగా, ప్రతిరక్షకాల స్పందనలు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది.

లండన్: ఫ్లూ వ్యాక్సిన్లు ఉదయం పూట వాడినప్పుడు ఎక్కువ క్రియాశీలకంగా, ప్రతిరక్షకాల స్పందనలు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది. ఇన్‌ఫ్లూయెంజా ‘వ్యాక్సినేషన్ ప్రోగ్రాం’లో భాగంగా లండన్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ప్రభావంపై అధ్యయనం చేశారు. మూడు రకాల ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లతో పోరాడేందుకు వివిధ రకాల వ్యాక్సిన్లను 65 ఏళ్లకు పైబడిన దాదాపు 276 మందిపై ప్రయోగించారు.

ఉదయం 9 -11 గంటల మధ్య, మధ్యాహ్నం 3-5 గంటల మధ్య శస్త్రచికిత్సలు జరిగిన వారికి ఈ మూడు రకాల వ్యాక్సిన్లను వేర్వేరుగా నెలరోజుల పాటు ఇచ్చారు. మొదటి రెండు వ్యాక్సిన్లు ఇచ్చిన వారిలో మధ్యాహ్నం వ్యాక్సిన్ ఇచ్చిన వారి కన్నా ఉదయం ఇచ్చిన వారిలో ప్రతి రక్షకాలు ఎక్కువగా విడుదలైనట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement