బీచ్‌లోకి వెళితే వికృత రూపం.. | Monster Fish Weighing 150 Kgs Washes Up | Sakshi
Sakshi News home page

అది ఏం చేపనో చెప్పగలరా?

Mar 9 2018 3:52 PM | Updated on Mar 9 2018 4:18 PM

Monster Fish Weighing 150 Kgs Washes Up - Sakshi

సిడ్నీ : ఓ వికృత రూపంలో ఉన్న చనిపోయిన చేప ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ బీచ్‌ ఒడ్డుకొచ్చి పడింది. దాన్ని చూసిన వారు తీవ్ర ఆశ్చర్యానికి లోనవుతున్నారు. రాక్షస చేపలా ఉన్న దానిని చూసి ఈ చేపను ఏమంటారబ్బా అని తలలు బాదుకుంటున్నారు. ఎందుకంటే దాని బరువు కనీసం ఓ 150 కేజీలు ఉండి.. పొడవు దాదాపు ఐదున్నర అడుగులు ఉంది. జాన్‌, రిలే లిందామ్‌ అనే ఇద్దరు స్నేహితులు వివిధ రకాల జంతువులను చూస్తూ మూర్‌పార్క్‌ బీచ్‌ వైపు వెళ్లారు. అక్కడ దాదాపు కుళ్లిన స్థితిలో ఉన్న ఆ చేప కళేబరాన్ని చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు.

'నేను చాలా రకాల చేపలను చూశాను. పెద్ద చేపలను కూడా.. కానీ, ఇప్పటి వరకు ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ గుర్తు తెలియని చేప కచ్చితంగా ఇప్పటి వరకు బయటి వ్యక్తులకు తెలియనిదే అయ్యి ఉంటుంది' అని లిందామ్‌ చెప్పాడు. అతడు ఆ చేప ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి ఈ చేప వివరాలేమిటో చెప్పండి అంటూ కోరాడు. రాక్షస చేపలాంటి మూతి, వీపుపై రంపాన్ని మించిన భారీ ముళ్లు, వెడల్పైన తోక మొత్తానికి ఒక వికృతాకారంలో మాత్రం అది ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement