త్వరలోనే ‘టైమ్‌ మెషిన్‌’ | Sakshi
Sakshi News home page

త్వరలోనే ‘టైమ్‌ మెషిన్‌’

Published Mon, May 1 2017 2:11 AM

త్వరలోనే ‘టైమ్‌ మెషిన్‌’

టొరంటో: గతం లేదా భవిష్యత్తులోకి తీసుకెళ్లే టైమ్‌ మెషిన్‌ త్వరలోనే సాకారమయ్యే  అవకాశముంది. దీనికి అవసరమైన గణిత, భౌతిక సిద్ధాంతాన్ని అమెరికాలోని వర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా ఇన్‌ కెనడాకు చెందిన శాస్త్రవేత్త బెన్‌ టిప్పెట్‌ అభివృద్ధి చేశారు.

‘ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం ప్రకారం అంతరిక్షం, సమయంలో వక్రీకరణల వల్ల గురుత్వాకర్షణ క్షేత్రాలు ఏర్పడ్డాయి.  ఇటీవల లిగో సైంటిఫిక్‌ బృందం కొన్ని కాంతి సంవత్సరాల క్రితం కృష్ణబిలాలు ఢీకొనడంతో ఏర్పడ్డ∙గురుత్వాకర్షణ తరంగాల్ని గుర్తించింది. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాన్ని ఉపయోగించి అంతరిక్ష సమయాన్ని వలయాకారంలోకి మార్చి, గతం లేదా భవిష్యత్తులోకి ప్రయాణించవచ్చు’ అని టిప్పెట్‌ తెలిపారు.

Advertisement
Advertisement