పక్షులను గుర్తించేందుకు మొబైల్ యాప్! | Mobile app to identify birds | Sakshi
Sakshi News home page

పక్షులను గుర్తించేందుకు మొబైల్ యాప్!

May 30 2014 2:37 AM | Updated on Sep 2 2017 8:02 AM

పక్షులను గుర్తించేందుకు మొబైల్ యాప్!

పక్షులను గుర్తించేందుకు మొబైల్ యాప్!

మీకో అందమైన పక్షి కనిపించింది. వెంటనే ఫొటో తీశారు. కానీ అది ఏ పక్షో? దాని విశేషాలేంటో మాత్రం తెలియలేదు. అయితే ఏం ఫర్వాలేదు.

 మీకో అందమైన పక్షి కనిపించింది. వెంటనే ఫొటో తీశారు. కానీ అది ఏ పక్షో? దాని విశేషాలేంటో మాత్రం తెలియలేదు. అయితే ఏం ఫర్వాలేదు. మీ మొబైల్‌లో బర్డ్‌స్నాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి.. ఆ పక్షి ఏ జాతిదో? దాని వివరాలేంటో ఇట్టే తెలిసిపోతాయి. అప్‌లోడ్ చేసిన ఫొటోలను పరిశీలించి సుమారు 500 పక్షిజాతులను గుర్తించే సరికొత్త ఐఫోన్ యాప్ ‘బర్డ్‌స్నాప్’ను కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు మరి.
 
ఏ పక్షి అరుపు ఎలా ఉంటుందో కూడా ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. అలాగే వంశ వృక్షం లేదా వర్ణమాలలోని అక్షరక్రమం లేదా ఒక ప్రాంతానికి, సీజన్‌కు ప్రత్యేకమవడం వంటి అంశాల ఆధారంగా కూడా ఆయా పక్షులను గుర్తించొచ్చు. త్వరలో వివిధ పక్షుల పాటలు, వాటి ఆడియో, వీడియోలను కూడా ఈ యాప్‌లో పొందుపరుస్తారట. అయితే ఈ యాప్‌లో ఉత్తర అమెరికాలో సాధారణమైన పక్షిజాతులే ఎక్కువగా ఉన్నాయి. అన్నట్టూ.. రకరకాల చెట్లను గుర్తించేందుకు ఉపయోగపడే ‘లీఫ్‌స్నాప్’ అనే యాప్‌ను కూడా వీరు గతంలో విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement