మేరా మార్స్‌ మహాన్‌..

మేరా మార్స్‌ మహాన్‌..

అరుణగ్రహం (మార్స్‌) పై నివాసం ఏర్పాటు చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు.. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే అది ఇంకా సాధ్యం కాలేదు కానీ ఈ లోపే ఆ గ్రహంపై నివసించబోయే వారి కోసం అంటూ ఓ పాట కూడా రాసేశారు. ఆ గ్రహానికి జాతీయ గీతం అన్నమాట! మార్స్‌ సొసైటీ అనే సంస్థ అరుణ గ్రహంపై కాలనీ ఏర్పాటు చేయాలని.. దాన్ని ప్రత్యేక దేశంగా పరిగణించాలని ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.



‘రైజ్‌ టు మార్స్‌.. మెన్‌ అండ్‌ విమన్‌’అంటూ సాగిపోయే ఈ పాటలో ఆ గ్రహాన్ని చేరాలని కలలు కందాం.. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం.. మన కోసం, మన పిల్లల కోసం ఇళ్లు కట్టుకుందాం.. ఎడారికి జీవం పోద్దాం అంటూ సాగుతుంటుంది. కళ్లముందు సవాళ్లూ ఉన్నాయని, మనిషి సామర్థ్యం ముందు ఇవి నిలబడవన్న స్ఫూర్తిని నింపుతుంది ఈ పాట. ముంబైలో పుట్టి.. అక్కడి సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో విద్యనభ్యసించిన ఆస్కార్‌ డామ్‌ విక్టర్‌ కాస్టెలీనో ఈ పాటను రాయడమే కాకుండా సంగీతమూ సమకూర్చారు.
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top