లైంగిక దాడులకు చట్టబద్ధత బిల్లు!

Marry Your Rapist Bill to Be Introduced in Turkey - Sakshi

ఇస్తాంబుల్‌: మానవ జీవనానికి అనువైన దేశంగా గణతికెక్కిన టర్కీలో 18 ఏళ్ల లోపు పిల్లలను రేప్‌ చేసిన వారే పెళ్లి చేసుకున్నట్లయితే వారికి శిక్ష నుంచి మినహాయించే బిల్లు టర్కీ పార్లమెంట్‌ సిద్ధం చేసింది. ‘మ్యారీ యువర్‌ రేపిస్ట్‌’గా పిలుస్తున్న ఈ బిల్లును ఈ నెలాఖరులో ప్రవేశపెడుతున్నట్లు తెలియగానే ఇటు దేశంలోని ప్రతిపక్ష ఎంపీలు, అటు ఐక్యరాజ్య సమితి మండిపడింది.

దీనివల్ల రేప్‌లకు చట్టబద్ధత లభించడమే కాకుండా బాల్య వివాహాలు ఎక్కువవుతాయని, పిల్లలపై రేప్‌లు మరింత పెరగుతాయని ఐక్యరాజ్య సమతి హెచ్చరించింది. అంతేకాకుండా నచ్చిన బాలికలను పెళ్లి చేసుకునేందుకే లైంగిక దాడులు పెరగుతాయని, ఇష్టం లేకపోయినా రేపిస్టులను పెళ్లి చేసుకోవాలంటూ బాలికలపై ఒత్తిడి పెరుగుతుందని విపక్ష ఎంపీలు హెచ్చరించారు. వెంటనే బిల్లును నిలిపి వేయాల్సిందిగా పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.


వాస్తవానికి 2016లోనే ఈ బిల్లును టర్కీ ప్రభుత్వం పార్లమెంట్‌ ముందు ప్రవేశపెట్టింది. 15 ఏళ్ల లోపు బాధితులను రేపిస్టులు పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి బెదిరింపులు, ఒత్తిడులు లేకుండా బాలికల అనుమతి తీసుకోవాలని నాటి బిల్లులో ప్రతిపాదించారు. ఆ బిల్లుపై అప్పుడు కూడా ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో పాలకపక్ష ఏకే పార్టీ తదుపరి సంప్రతింపుల పేరిట బిల్లును ఉపసంహరించుకుంది. ఇప్పుడు మైనర్‌ బాలికల వయస్సును 15 నుంచి 18 ఏళ్లకు పెంచుతూ బిల్లును సవరించారు.

పౌర వివాహాలను చేసే హక్కును ముస్లిం ముఫ్తీలకు కల్పిస్తూ 2017లో కూడా టర్కీ ప్రభుత్వం ఓ వివాదాస్పద చట్టం తీసుకొచ్చింది. దీని వల్ల బాల్య వివాహాలు పెరుగుతాయని, పైగా దేశ లౌకిక రాజ్యాంగానికి విరుద్ధమంటూ విమర్శలు వచ్చినా బిల్లు నాడు పాసయింది. ఇప్పుడు ఏం జరగతుందో చూడాలి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top