ఇంట్లోకి టైటానిక్‌లాంటి షిప్‌ దూసుకొస్తుందని.. | Man Panics In Terrifying Video As Cruise Ship Comes Close To their Home | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి టైటానిక్‌లాంటి షిప్‌ దూసుకొస్తుందని..

Mar 10 2017 9:49 AM | Updated on Aug 29 2018 8:36 PM

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ జంట తీవ్రంగా భయపడింది. ఒక భారీ షిప్‌ తమ ఇంట్లోకి దూసుకొస్తుందని భయపడుతూ గట్టిగా కేకలు వేసింది. వాళ్ల ఇంటి ముందున్న కుక్కలు కూడా ఆ సీన్‌ చూసి బెంబేలెత్తిపోయాయి.

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ జంట తీవ్రంగా భయపడింది. ఒక భారీ షిప్‌ తమ ఇంట్లోకి దూసుకొస్తుందని భయపడుతూ గట్టిగా కేకలు వేసింది. వాళ్ల ఇంటి ముందున్న కుక్కలు కూడా ఆ సీన్‌ చూసి బెంబేలెత్తిపోయాయి. బిల్‌ తోడాంటర్‌ అనే వ్యక్తి లాడర్‌డేల్‌ అనే పోర్టు నుంచి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా పెద్ద వైరల్‌ అయింది.

లాడర్‌ డేల్‌ పోర్ట్‌ సమీపంలోని బీచ్‌లోని ఓ నివాసంలో ఓ జంట ఏడేళ్లుగా నివసిస్తోంది. ఆ ఇళ్లు బీచ్‌ ఒడ్డునే కావడంతో కాస్తంత సముద్రంలోకి ఉంటుంది. అయితే, ఇటీవలె దాదాపు ఒక ఎనిమిది అంతస్తుల పెద్ద జిగ్నాటిక్‌ క్రూయిజ్‌ లైనర్‌ అనే భారీ నౌక వారి ఇంటివైపుగా వచ్చింది.

ఆ సీన్‌ చూసి ఇంట్లోని మహిళ బెంబేలెత్తిపోయింది. తన భర్తను వెళ్లి ఆ షిప్‌ను ఆపించండి అని చెప్పడంతో అతడు చేతులు ఊపుతూ హలో అంటూ గట్టిగా అరిచాడు. ‘మీరు  చాలా దగ్గరగా వస్తున్నారు. పరిమితి దాటవొద్దు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి’ ఆమె కేకలుపెట్టింది. ఆ సమయంలో నౌక మా ఇంట్లోకి వస్తుంది. నేను నిజంగా భయపడిపోయాను. నేను మా ఇంట్లో కుక్కల గురించి.. నా ఇల్లు గురించి చాలా బాధపడ్డాను. మా ఏడేళ్ల జీవితంలో ఎప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు. సరిగ్గా 100 మీటర్ల దూరంలోనే నౌక ఆగిపోయింది’  అంటూ ఆ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement