వజ్రం కన్నా గట్టి పదార్థం ఉందా? | lonsdaleite is stronger than diamond | Sakshi
Sakshi News home page

వజ్రం కన్నా గట్టి పదార్థం ఉందా?

Nov 6 2016 10:42 AM | Updated on Sep 4 2017 7:23 PM

వజ్రం కన్నా గట్టి పదార్థం ఉందా?

వజ్రం కన్నా గట్టి పదార్థం ఉందా?

భూమిపై ఉన్న అన్ని పదార్థాల్లో వజ్రం అత్యంత గట్టిదని మనకు తెలుసు.

భూమిపై ఉన్న అన్ని పదార్థాల్లో వజ్రం అత్యంత గట్టిదని మనకు తెలుసు. కానీ దీని కన్నా గట్టి పదార్థం ఉందంటే అది ఆశ్చర్యకరమే! దాని పేరు ‘లాన్స్‌డైలెట్‌’ పేరు విని ఏదో గరుకైన రాయి లాంటి పదార్థం అనుకుంటే పొరపాటు. షట్కోణాలు లేదా ఆరు మూలల ఆకారంతో కార్భన్ అణువులతో నిర్మించబడిన పదార్థమే ‘లాన్స్‌డైలెట్‌’ . అందుకే దీన్ని షట్కోణ వజ్రం అని కూడా పిలుస్తారు. చూడడానికి అచ్చం వజ్రం లాగానే ఉన్నప్పటికీ లాన్స్‌డైలెట్ సాధారణ వజ్రం కంటే 58% గట్టిది.

గ్రాఫైట్‌ రాయి కలిగిన ఉల్కలు భూమిని తాకినపుడు ఆ వేడికి, ఒత్తిడికి గ్రాఫైట్‌ లాన్స్‌డైలెట్‌గా మారుతుంది. ఇలా తయారైన లాన్స్‌డైలెట్‌ను మొట్టమొదటిసారి 1966లో కనుగొన్నారు. మరి ఇంతగట్టి పదార్థం కావాలనుకునే శాస్త్రవేత్తలు ఉల్కలు పడేంత వరకూ వేచి చూస్తూ కూర్చుంటారా? లేదు కదూ! అందుకే వారు 1966 నుండే గ్రాఫైట్‌ను భయంకరమైన వేడికి, ఒత్తిడికి లోనుచేసి ప్రయోగశాలలో కృత్రిమ లాన్స్‌డైలెట్‌లను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే సైంటిస్టులు ఇప్పటివరకూ కృత్రిమంగా మాత్రం సహజంగా ఏర్పడ్డ స్థాయిలో ‘లాన్స్‌డైలెట్‌’ ను తయారు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement