
లండన్: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు తాజాగా లండన్ దగ్గర్లోని థేమ్స్ నదిలో బయటపడింది. ఈ ప్రాంతం లండన్ సిటీ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో సోమవారం అక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సిన అన్ని విమానాలనూ రద్దు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఈ బాంబు బయటపడటంతో అప్పుడే విమానాశ్రయాన్ని పోలీసులు మూసివేశారు. దీంతో 16 వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. చుట్టు పక్కల ఇళ్లలోని వారిని కూడా ఖాళీ చేయించిన అధికారులు.. పోలీసులతో కలసి బాంబును తీసివేసే పనిలో నిమగ్నమయ్యారు.