విషాదం: చిన్నారి పుర్రె మాత్రమే మిగిలింది

Leopard Kills Ranger Son in Uganda - Sakshi

కంపాలా: ఉగాండలోని క్వీన్‌ ఎలిజిబెత్‌ నేషనల్‌ పార్క్‌లో చిన్నారి ఉదంతం విషాదంగా ముగిసింది. మూడేళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లిన చిరుత చంపి తినేసింది. చిన్నారి పుర్రె, దుస్తుల అవశేషాలను అధికారులు గుర్తించారు. శుక్రవారం రాత్రి  ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫారెస్ట్‌ రేంజర్‌ డోరీన్‌ అయేరా కొడుకు ఎలిషా నబుగ్యేరే(3) ఆయాతో క్వార్టర్స్‌ బయట ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.  చిన్నారి వెనకాలే వచ్చిన చిరుత ఒక్క దూటుతో లాక్కెల్లింది. ఆయా అరుపులు విన్న సిబ్బంది కాల్పులు ప్రారంభించగా చిరుత పొదల్లోకి పారిపోయింది. వెంటనే భారీగా అటవీ సిబ్బంది రంగంలోకి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆదివారం ఉదయం పిల్లాడి పుర్రె, దుస్తులు లభ్యం కావటంతో చిన్నారి మృతి చెందినట్లు అటవీ అధికారులు ప్రకటించారు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది.

క్వార్టర్స్‌ వద్ద కంచె(ఫెన్సింగ్‌) లేకపోవటంతోనే చిరుత దాడి చేసిందని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేసినట్లు ఫారెస్ట్‌ అధికారి బషీర్‌ హంగ్‌ ప్రకటించారు. చిరుత మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో దానిని మట్టుపెట్టుందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top