అవి కిరణాలా.. హైడ్రోజన్‌ బాంబులా?

అవి భూమిని తాకితే..?! - Sakshi


సాక్షి, న్యూయార్క్‌ : సూర్యుడు మండుతున్నఅగ్నిగోళం. ఆయన నుంచే అన్నీ వెలుగు, వేడి వస్తున్నాయని మనకు తెలుసు. ఆయన నుంచే అత్యంత శక్తివంతమైన అల్ఫా, గామా, బీటా కిరణాలు భూమ్మీదకు వస్తున్నాయని.. వాటిని ఓజోన్‌పొర అడ్డుకుంటోందని తెలుసు..


ఈ మధ్యకాలంలో  సూర్యుడి నుంచి శక్తివంతమైన కిరణాలు, విపరీతమైన ఉష్ణం భూమ్మీదకు వస్తోంది. తాజాగా అత్యంత శక్తివంతమైన సూర్యకిరణాలు.. దాదాపు 48 గంటల పాటు విశ్వంలోకి ప్రసరించాయి. స్వీడన్‌లోని లా ప్లామా అనే శక్తివంతమైన టెలిస్కోప్‌ నుంచి సోమవారం ఈ ఉష్ణకిరణాల ప్రసారాన్ని.. వాటి తీవ్రతను సైంటిస్టులు గుర్తించారు. గత 12 ఏళ్లలో ఇంతటి శక్తివంతమైన ఉష్ణ కిరణ ప్రసారాలను చూడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  వీటిని ఎక్స్‌- కేటగిరీ మంటలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కిరణాల శక్తిని అంచనా ప్రపంచ శాస్త్రవేత్తలు ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఈ కిరణాలు నేరుగా మన భూమిని తాకి ఉంటే.. ఇప్పటికి ఒక్క చిన్న ముక్క కూడా మిగలకుండా మండిపోయి ఉండేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. 


ఎక్స్‌-కిరణాల శక్తి దాదాపు వెయ్యి బిలియన్ల హైడ్రోజన్‌ బాంబులకు సమానంగా ఉండొచ్చని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. వాటిని శక్తిని శాస్త్రవేత్తలు ఎవరూ అంచనా వేయలేకపోయారు.. కానీ సూర్యుడి నుంచి వెలువడిన ఆ వేడిని దాదాపు 12 హైడ్రోజన్‌ బాంబుల శక్తికి సమానం అని.. నాసా సైంటిస్టులు ఒక అంచనాకు వచ్చారు.


 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top