కోవిడ్‌ వ్యాక్సిన్‌ ధర తక్కువే | Keenly-watched COVID-19 vaccine wont be expensive | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వ్యాక్సిన్‌ ధర తక్కువే

May 17 2020 4:17 AM | Updated on May 17 2020 4:17 AM

Keenly-watched COVID-19 vaccine wont be expensive - Sakshi

లండన్‌: కోవిడ్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచదేశాలు  ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి యూకేలో ఆక్సఫర్డ్‌ వర్సిటీ పరిశోధన మీదే ఉంది. మందుల తయారీ కంపెనీ అస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో జెన్నర్‌ ఇనిస్టిట్యూట్‌ రూపొందిస్తున్న ChAdOx1  nCoV-19 అనే ఈ వ్యాక్సిన్‌ కోతులపై సానుకూల ఫలితమివ్వడం తెల్సిందే. వ్యాక్సిన్‌ ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచదేశాలన్నింటికీ అందుబాటులోకి తెస్తామని పరిశోధనల్లో పాల్గొంటున్న ఆక్స్‌ఫర్డ్‌ జెన్నర్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ అడ్రియాన్‌ హిల్‌ చెప్పారు. మనుషులపై ప్రయోగాలు సక్సెస్‌ అయితే వ్యాక్సిన్‌ ధర ఎంతవరకు ఉంటుందన్న సందేహాలను ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్‌ నివృత్తి చేశారు.

అతి తక్కువ ధరలో అత్యధికులకి వ్యాక్సిన్‌ అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని వెల్లడించారు. ‘ఈ వ్యాక్సిన్‌ ఒక్క డోసు చాలు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేలా వివిధ ప్రాంతాల్లో ల్యాబ్‌లలో దీన్ని రూపొందిస్తాం’ అని హిల్‌ చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లయ్‌ ఉండడం కోసం ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏడు ఇనిస్టిట్యూట్‌లలో తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భారత్‌లోని పుణేలో ఉన్న సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా ఉంది. యూరప్, చైనాలో వివిధ ఇనిస్టిట్యూట్‌లలో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తారు. జూలై, ఆగస్టునాటికల్లా మానవులపై ఈ వ్యాక్సిన్‌ ఎలా పనిచేస్తుందో తేలిపోతుందని హిల్‌ వివరించారు.

జాగిలాలు కరోనా జాడ పడతాయా?
కరోనా వైరస్‌ లక్షణాలు మనిషిలో బయటపడక ముందే ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన కోవిడ్‌ జాగిలాలు వారిని గుర్తించగలవేమోనన్న దిశగా యూకే ప్రభుత్వం పరిశోధనలు ప్రారంభించింది. కోవిడ్‌ రోగి నుంచి శాంపిల్స్, కోవిడ్‌ లేని వారి నుంచి శాంపిల్స్‌ సేకరించి వాటిని ఆ జాగిలాల దగ్గర ఉంచి వాసన ద్వారా పసిగట్టేలా జాగిలాలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement