'మీరసలు నా ఫ్యాన్సేనా.. ఏంటీ ఈ అసహ్యం' | Justin Bieber slams fans for targeting his friend Sofia Richie | Sakshi
Sakshi News home page

'మీరసలు నా ఫ్యాన్సేనా.. ఏంటీ ఈ అసహ్యం'

Aug 15 2016 8:59 AM | Updated on Sep 4 2017 9:24 AM

'మీరసలు నా ఫ్యాన్సేనా.. ఏంటీ ఈ అసహ్యం'

'మీరసలు నా ఫ్యాన్సేనా.. ఏంటీ ఈ అసహ్యం'

ఫ్యాన్స్పై అమెరికన్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ అలిగాడు. కోపంతో చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

లాస్ ఎంజెల్స్: ఫ్యాన్స్పై అమెరికన్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ అలిగాడు. కోపంతో చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు. తనకు తెలిసిన అమ్మాయిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాస్తంత అలక బుచ్చుకున్నాడు. తన స్నేహితురాలిపై అభిమానులు ఇలాగే కామెంట్స్ చేస్తే తాను ఫ్యాన్స్కోసం ఫొటోలు, వీడియోలు అందుబాటులో ఉంచనని, వాటిని ప్రైవేట్గా మార్చుకుంటానని చెప్పాడు. ఈ నెల ప్రారంభంలో మోడల్ సోఫియా రిచీతో చెట్టాపట్టాలేసుకొని బీబర్ తిరుగుతున్నాడని, డేటింగ్ చేస్తున్నాడని విపరీతంగా వదంతులు వ్యాపించాయి.

బీబర్ ఫ్యాన్స్ సైతం దీనిపై బాగా స్పందిస్తూ అన్ని నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. వాడ కూడని భాష ఉపయోగించారు. దీంతో చిన్నబుచ్చుకున్న బీబర్ 'మీరు నాకు నిజంగా అభిమానులే అయితే ఇలా చేయరు. మీరు ఇలాంటి అసహ్యకరమైన పనులు ఆపకుంటే నా ఇన్స్టాగ్రమ్ ఖాతాను ప్రైవేట్గా మార్చుకుంటా. నా ఫొటోలు, వీడియోలు ఏవీ మీకోసం పబ్లిక్ గా పెట్టను' అంటూ అతడు తన ఇన్స్టాగ్రమ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతోపాటు వారిద్దరి బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరు జపాన్ లో ఉన్నారు. ఇక్కడ అతడు త్వరలో రెండు ప్రదర్శనలు ఇవ్వబోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement