భూకంపం: 30 మందికి గాయాలు | Japan earthquake collapses homes, causes injuries | Sakshi
Sakshi News home page

భూకంపం: 30 మందికి గాయాలు

Nov 23 2014 9:44 AM | Updated on Sep 2 2017 4:59 PM

జపాన్లోని నగానో నగరంలో భూకంపం సంభవించింది.

టోక్యో: జపాన్లోని నగానో నగరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8 గా నమోదు అయిందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. భూకంప ధాటికి దాదాపు సుమారు ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపింది.  30 మంది గాయపడ్డారని పేర్కొంది. వారు నగరంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని... వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పింది. కాగా సునామీ విపత్తు వచ్చే సూచనలు ఏమి లేవని చెప్పింది.

నగానో నగరానికి దాదాపు 10 మైళ్ల  దూరంలో ఈ భూకంపం గత రాత్రి సంభవించిందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. అయితే భూకంపం సంభవించిన పరిధిలో మ మూడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఉన్నాయని... అవి సాధారణ స్థితిలోనే ఉన్నాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement