ఐసిస్ మరో ఘాతుకం | ISIS release video Shows Turkish soldiers Burned Alive | Sakshi
Sakshi News home page

ఐసిస్ మరో ఘాతుకం

Dec 23 2016 12:46 PM | Updated on Sep 4 2017 11:26 PM

ఐసిస్ మరో ఘాతుకం

ఐసిస్ మరో ఘాతుకం

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు.

డయాస్కస్/అంకారా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. టర్కీ సైనికులను సజీవ దహనం చేసినట్లున్న ఓ వీడియోను ఉగ్రవాదులు విడుదలచేశారు. గత నెల రోజులుగా ఇద్దరు టర్కీ సైనికులను బంధించి బోనులో పెట్టి, ఆపై చిత్ర హింసలకు గురిచేసి సజీవదహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. జిహాది గ్రూప్ వెబ్ సైట్లలో గురువారం పోస్ట్ చేసిన ఆ వీడియో కలకలం రేపింది. ఇటీవల 16 మంది సైనికులను ఇస్లామిక్ స్టేట్ హత్యచేసింది. ఇదే క్రమంలో టర్కీ సైనికులపై తమ దాడులను  టర్కీ సైనికుల సజీవదహనం ఘటన 2014 డిసెంబర్ లో ఉగ్రవాదులు జోర్డాన్ ఫైటర్ జెట్ ఫ్లైట్ పైలట్ మాజ్ అల్ కసాస్బ్ ను బోనులో బంధించి, ఆపై చిత్రహింసలకు గురిచేసి బోనులోనే సజీవ దహనం చేసిన ఘటనను తలపిస్తోంది.

ఇద్దరు ఉగ్రవాదులు టర్కీ అధ్యక్షుడు తాయిప్ ఎర్డోగన్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సజీవదహనానికి గురైన సైనికులను జిహాదిస్టులు బంధించినట్లు ఐఎస్ఐఎస్ అనుబంధ న్యూస్ ఏజెన్సీ అమఖ్ గత నెలలోనే కథనాలు అందించింది. ముఖ్యంగా గత మూడు రోజులుగా సిరియాలోని పలు ప్రాంతాలలో వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని అధికారులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement