'వైట్హౌస్ను బాంబులతో పేల్చేస్తాం' | IS threatens to blow up White House | Sakshi
Sakshi News home page

'వైట్హౌస్ను బాంబులతో పేల్చేస్తాం'

Nov 20 2015 10:45 AM | Updated on Sep 3 2017 12:46 PM

'వైట్హౌస్ను బాంబులతో పేల్చేస్తాం'

'వైట్హౌస్ను బాంబులతో పేల్చేస్తాం'

అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్హౌస్ను పేల్చివేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెదిరించారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్హౌస్ను పేల్చివేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెదిరించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరిస్తూ ఉగ్రవాదులు మరో వీడియోను 'పారిస్ బిఫోర్ రోమ్' పేరుతో విడుదల చేశారు. 6 నిమిషాల నిడివి గల ఈ వీడియోను ఇరాక్లో రూపొందించారు.

పారిస్లో మరిన్ని దాడులు చేయడంతో పాటు వైట్హౌస్ను బాంబులతో పేల్చివేస్తామని వీడియోలో ఓ ఉగ్రవాది బెదిరించాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెను చంపేస్తామని వీడియోలో మరో ఉగ్రవాది హెచ్చరించాడు. 'ఆత్మాహుతి బాంబు దాడులు, కారు బాంబులతో మిమ్నల్ని చంపేస్తాం. మీరెక్కడికి వెళ్లినా వదలిపెట్టం' అని ఆ ఉగ్రవాది అన్నాడు.

న్యూయార్క్లో దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వీడియో విడుదల చేసిన మరుసటి రోజు తాజా వీడియో విడుదల చేశారు. అయితే అమెరికాలో పారిస్ తరహా దాడుల ముప్పు లేదని ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement