రైలు కాదు.. నడిచే ఇంద్రభవనం..!!

Inside Kim Jong Un Secret Train Revealed - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌, ఉత్తరకొరియా : ఉత్తరకొరియా నియంతలకు అత్యంత ప్రీతిపాత్రమైన రవాణా సాధనం ‘రహస్య రైలు’ లోపలి ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. విమాన భయం ఉన్న కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌ ఈ రైలును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. అంతేకాకుండా ఈ రైలులో పలు ప్రపంచదేశాలకు ఆయన ప్రయాణించారు కూడా.

దాదాపు 90 పెట్టెలు ఉండే ఈ రైలులో దేశాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సమయంలో భద్రత రీత్యా ముందొక రైలు, వెనుక మరో రైలు కాపలా ఉంటాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌ రైలు కావడంతో ఒక్కో పెట్టె భారీగా బరువు ఉంటుంది. దీంతో ఈ రైలు ప్రయాణించే వేగం అత్యధికంగా గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే. లగ్జరీ సీటింగ్‌తో పాటు ప్రపంచదేశాలకు చెందిన వైన్‌, ఆహార పదార్థాలు ఎల్లప్పుడూ ఈ రైలులో సిద్ధంగా ఉంటాయి.

ఇప్పటివరకూ ఉత్తరకొరియాలోని పలు ప్రదేశాలకు ప్రయాణించడానికి మాత్రమే రైలును ఉపయోగించిన కిమ్‌.. తొలిసారిగా చైనా ట్రిప్‌కు ఈ రైలును వాడారు. ఈ సందర్భంగా చైనా అధికారులతో చర్చలు జరిపేందుకు జర్నలిస్టులను రైలులోకి అనుమతించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top