చిందేసిన భారత్‌, పాక్‌ సైన్యం

India And Pakistan Troops Dance To Bollywood Songs  - Sakshi

మాస్కో:  సరిహద్దుల్లో ఎప్పుడూ తుపాకులతో తలపడే భారత్‌, పాకిస్తాన్‌ సైనికులు తొలిసారి చిందేశారు. బాలీవుడ్‌ సాంగ్స్‌కు తమ స్టెప్టులతో శాంతి సందేశాన్నిచ్చారు. రష్యాలో జరిగిన యాంటీ టెర్రర్‌ డ్రిల్‌లో పాల్గొన్న ఇరు దేశాల జవాన్లు.. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో కలిసి డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. రష్యాలోని చెబర్కుల్‌ పట్టణంలో జరిగిన ఈ డ్రిల్‌ను బీజింగ్‌కు చెందిన షాంఘై కార్పోరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) నిర్వహించింది.

ఈ వీడియోను న్యూఢిల్లీలోని రష్యా ఎంబసీ సైతం ట్వీట్‌ చేసింది. ఎస్‌సీవో సభ్యదేశాలు అయిన తర్వాత తొలిసారి దాయదీ దేశాలు మిలిటరీ విన్యాసాల్లో పాల్గొన్నాయి. రష్యాకు చెందిన సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో ఈ సంయుక్త విన్యాసాలు జరిగాయి. ఈ డ్రిల్‌కు భారత్‌-పాక్‌ కలిసి రావడాన్ని చైనా స్వాగతించింది. రష్యా, చైనా, కజకిస్తాన్‌, తజకిస్తాన్‌, కిర్గిజిస్తాన్‌, భారత్‌, పాక్‌ల నుంచి మూడు వేల మంది సైనికులు ఈ డ్రిల్‌లో పాల్గొన్నారు. 2001లో ఏర్పాటు అయిన ఎస్‌సీవోలో చైనా, రష్యా, కజకిస్తాన్‌, తజకిస్తాన్‌, కిర్గిజిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ దేశాలు వ్యవస్థాపక సభ్యులుగా కాగా.. 2017లో పాక్‌, భారత్‌లు కలిసాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top