ఎత్తు తక్కువుంటే ‘ప్రిమెచ్యూర్ బేబీ’ ప్రమాదం | If height of less 'Premature Baby' danger | Sakshi
Sakshi News home page

ఎత్తు తక్కువుంటే ‘ప్రిమెచ్యూర్ బేబీ’ ప్రమాదం

Apr 25 2016 1:15 AM | Updated on Sep 3 2017 10:39 PM

ఎత్తు తక్కువుంటే ‘ప్రిమెచ్యూర్ బేబీ’ ప్రమాదం

ఎత్తు తక్కువుంటే ‘ప్రిమెచ్యూర్ బేబీ’ ప్రమాదం

ఎత్తు తక్కువగా ఉన్న గర్భిణులకు నెలలు నిండకముందే ప్రసవమయ్యే ప్రమాదం.. సాధారణ లేదా పొడవైన మహిళల కన్నా రెండింతలు ఎక్కువగా ఉంటుందని తేలింది.

మెల్‌బోర్న్: ఎత్తు తక్కువగా ఉన్న గర్భిణులకు నెలలు నిండకముందే ప్రసవమయ్యే ప్రమాదం.. సాధారణ లేదా పొడవైన మహిళల కన్నా రెండింతలు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఎత్తు తగ్గుతున్న కొద్దీ నెలలు నిండకముందే ప్రసవం జరిగే ప్రమాదం అంతగా పెరుగుతుందని స్వీడన్‌లోని ఉప్సల, న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ వర్సిటీల అధ్యయనం హెచ్చరించింది.

155 సెంటీమీటర్లు అంతకన్నా తక్కువ ఎత్తు ఉన్న మహిళల పిల్లల్లో 9.4% మంది పూర్తిగా నెలలు నిండకముందే పుట్టినవారు కాగా, 1.1% మంది 8 నెలలు కూడా నిండకముందే జన్మించినవారని, ఇది పొడవైన వారిలో వరుసగా 4.7%, 0.5%గా ఉందని తేలింది. స్వీడన్‌లోని 1.92 లక్షలమంది మహిళలపై ఈ అధ్యయనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement