ఏకరూప కవలల షాకింగ్ ఘటనలు!!

ఏకరూప కవలల షాకింగ్ ఘటనలు!! - Sakshi


సాధారణంగా కవలలు పుట్టడం గురించి వింటుంటాం. అందులోనూ అప్పుడప్పుడు ఏకరూప కవలలు జన్మిస్తుంటారు. ఇక్కడ మాత్రం వారి అభిరుచులు ఒక్కటే. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా. ఆ కవలలు నిద్రలేవడం నుంచి వారు చేసే పనులు, అభిరుచులు ఒకేలా ఉన్నాయి. ఈ వివరాలు గమనిస్తే టాలీవుడ్ మూవీ 'హలో బ్రదర్' లో నాగార్జున అక్కినేని కవలలుగా నటించిన విషయం గుర్తుకువస్తుంది. అది మూవీ కనుక ఇద్దరు నాగార్జునలు ఒకేసారి ఒకేపని చేసినట్లుగా కనిపిస్తారు, అది రీల్ లైఫ్.. కానీ ఇక్కడ రియల్ లైఫ్ లోనూ అలాంటి సీన్లు చోటుచేసుకున్నాయి. వారిద్దరూ ఏకరూప కవలలు అయినా, అభిరుచులతో పాటు ఒకేసారి పెళ్లిళ్లు చేసుకున్న ఆ కవలలు ఒకే సమయంలో గర్భం దాల్చారు. చివరికి ఒకే సమయంలో బిడ్డలకు జన్మనివ్వడం అసాధరాణ అంశం. అమెరికాకు చెందిన ఆ ఏకరూప కవలలే  లీ రాడ్జర్స్, సారా మారియాజ్. ప్రస్తుతం వారి వయసు 35 ఏళ్లు.



రాడ్జర్ కొలరెడో నివాసం ఉంటోంది. అయితే ఉదయం 5:30 గంటలకు తాను లేచి పనులు స్టార్ట్ చేస్తుంది. ఓ రోజు కాలిఫోర్నియాలో నివాసం ఉండే తన కవల సోదరి మారియాజ్ ఉదయం లేచి తనకు ఇప్పుడే లేచాను అని మెస్సేజ్ చేసిందని, సరిగ్గా మేం ఇద్దరూ నిద్రలేచే సమయం ఒకటే అని తెలుసుకున్నామని రాడ్జర్ చెప్పింది. జూన్ 30న వేకువజామున 1:18 నిమిషాలకు తనకు డెలివరీ అయ్యిందని రాడ్జర్ కు మారియాజ్ భర్త ఫోన్ చేయగా, సరిగ్గా కొలరెడోలో అదే సమయానికి తన భర్య ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే.. రాడ్జర్ బాబుకు పుట్టగా, రీడ్ జోసెఫ్ అని పేరు పెట్టారు. మారియాజ్ దంపతులకు కూతురు పుడితే సమంతా లిన్నే అని నామకరణం చేశారు.





చెల్లి ప్లాన్ చేస్తే.. అక్క షాకిచ్చింది!

సారా మారియాజ్ తన భర్త నిక్ తో కలిసి తన ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పి సర్ ప్రైజ్ ప్లాన్ చేసుకుని అక్క రాడ్జర్ (సారా కంటే రాడ్జర్ దాదాపు 11 నిమిషాలు ముందు పుట్టింది) ఇంటికి వెళ్లింది. అయితే రాడ్జర్ తాను కూడా గర్భం దాల్చినట్లు చెప్పి చెల్లెలితో పాటు ఆమె భర్తకు షాకిచ్చింది. ఇలా ప్రతి విషయంలో ఏకరూప కవలలకు జరిగే పనులు, ప్రగ్నెన్సీ, డెలివరీ కూడా ఏక కాలంలో జరిగిపోవడం తెలిసి అక్కడివారు ఆశ్చర్యపోతున్నారు. స్థానిక మీడియాలో ఈ కవల సోదరిమణుల విషయమే హాట్ టాపిక్ అయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top