breaking news
Identical Twin Sisters
-
70 ఏళ్ల తర్వాత కలుసుకుని.. అరుదైన రికార్డు సృష్టించిన కవలలు
టోక్యో: జపాన్‌కు చెందిన 107 ఏళ్ల అక్కాచెల్లెళ్లు ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన కవలలుగా గిన్నిస్ రికార్డులకెక్కారు. ఉమెనొ సుమియామ, కౌమె కొడమ అనే ఈ తోబుట్టువుల వయస్సు 107 ఏళ్ల 330 రోజులని ‘గిన్నిస్’సోమవారం తెలిపింది. వీరు ప్రపంచంలోనే జీవించి ఉన్న కవలల్లో అత్యంత వృద్ధులని పేర్కొంది. ఇప్పటి వరకు జపాన్‌కే చెందిన కిన్ నరిటా, జిన్ కానీ అనే కవలల పేరిట ఉన్న 107 ఏళ్ల 75 రోజుల రికార్డును ఈ సోదరీమణులు బద్దలు కొట్టారు. జపాన్‌లోని షొడొషిమా దీవిలో 1913 నవంబర్ 5వ తేదీన జన్మించిన వీరు చిన్నతనంలోనే వేరు పడిపోయారు. (చదవండి: విస్కీ బాటిల్ ఎక్కడుంది? విచారణ చేపట్టిన అమెరికా) దాదాపు 70 ఏళ్లు వచ్చే వరకు వేర్వేరు చోట్ల గడిపారు. అనంతరం ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు చేసి, 88 షికోకు ఆలయాలను సందర్శించుకున్నారు. ఎక్కువ రోజులు జీవించి, గత రికార్డులను బద్దలు కొట్టడంపై వీరిద్దరూ తరచు జోకులు వేస్తుంటారని కుటుంబసభ్యులు చెప్పారు. హాస్యచతురత, పెద్దరికం వీరిని 1990ల నుంచి పెద్ద సెలబ్రిటీలుగా మార్చేసింది. అందరూ వీరిని కిన్–సన్, జిన్–సన్ అని ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు చోట్ల ఆరోగ్య కేంద్రాల్లో ఉంటున్నారు. వీరి ఘనతను ప్రశంసిస్తూ గిన్నిస్ సంస్థ కొత్త రికార్డు సర్టిఫికెట్లను సోమవారం ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్డ్ డే’సందర్భంగా మెయిల్ ద్వారా పంపించింది. ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్డ్ డే’జపాన్‌లో జాతీయ సెలవుదినం. జపాన్ 12.5 కోట్ల జనాభాలో 29% మంది 65 ఏళ్లు, ఆపైని వారే. చదవండి: అమ్మాయిలుగా మారిన ఐడెంటికల్ ట్విన్స్ -
ఏకరూప కవలల షాకింగ్ ఘటనలు!!
సాధారణంగా కవలలు పుట్టడం గురించి వింటుంటాం. అందులోనూ అప్పుడప్పుడు ఏకరూప కవలలు జన్మిస్తుంటారు. ఇక్కడ మాత్రం వారి అభిరుచులు ఒక్కటే. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా. ఆ కవలలు నిద్రలేవడం నుంచి వారు చేసే పనులు, అభిరుచులు ఒకేలా ఉన్నాయి. ఈ వివరాలు గమనిస్తే టాలీవుడ్ మూవీ 'హలో బ్రదర్' లో నాగార్జున అక్కినేని కవలలుగా నటించిన విషయం గుర్తుకువస్తుంది. అది మూవీ కనుక ఇద్దరు నాగార్జునలు ఒకేసారి ఒకేపని చేసినట్లుగా కనిపిస్తారు, అది రీల్ లైఫ్.. కానీ ఇక్కడ రియల్ లైఫ్ లోనూ అలాంటి సీన్లు చోటుచేసుకున్నాయి. వారిద్దరూ ఏకరూప కవలలు అయినా, అభిరుచులతో పాటు ఒకేసారి పెళ్లిళ్లు చేసుకున్న ఆ కవలలు ఒకే సమయంలో గర్భం దాల్చారు. చివరికి ఒకే సమయంలో బిడ్డలకు జన్మనివ్వడం అసాధరాణ అంశం. అమెరికాకు చెందిన ఆ ఏకరూప కవలలే లీ రాడ్జర్స్, సారా మారియాజ్. ప్రస్తుతం వారి వయసు 35 ఏళ్లు. రాడ్జర్ కొలరెడో నివాసం ఉంటోంది. అయితే ఉదయం 5:30 గంటలకు తాను లేచి పనులు స్టార్ట్ చేస్తుంది. ఓ రోజు కాలిఫోర్నియాలో నివాసం ఉండే తన కవల సోదరి మారియాజ్ ఉదయం లేచి తనకు ఇప్పుడే లేచాను అని మెస్సేజ్ చేసిందని, సరిగ్గా మేం ఇద్దరూ నిద్రలేచే సమయం ఒకటే అని తెలుసుకున్నామని రాడ్జర్ చెప్పింది. జూన్ 30న వేకువజామున 1:18 నిమిషాలకు తనకు డెలివరీ అయ్యిందని రాడ్జర్ కు మారియాజ్ భర్త ఫోన్ చేయగా, సరిగ్గా కొలరెడోలో అదే సమయానికి తన భర్య ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే.. రాడ్జర్ బాబుకు పుట్టగా, రీడ్ జోసెఫ్ అని పేరు పెట్టారు. మారియాజ్ దంపతులకు కూతురు పుడితే సమంతా లిన్నే అని నామకరణం చేశారు. చెల్లి ప్లాన్ చేస్తే.. అక్క షాకిచ్చింది! సారా మారియాజ్ తన భర్త నిక్ తో కలిసి తన ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పి సర్ ప్రైజ్ ప్లాన్ చేసుకుని అక్క రాడ్జర్ (సారా కంటే రాడ్జర్ దాదాపు 11 నిమిషాలు ముందు పుట్టింది) ఇంటికి వెళ్లింది. అయితే రాడ్జర్ తాను కూడా గర్భం దాల్చినట్లు చెప్పి చెల్లెలితో పాటు ఆమె భర్తకు షాకిచ్చింది. ఇలా ప్రతి విషయంలో ఏకరూప కవలలకు జరిగే పనులు, ప్రగ్నెన్సీ, డెలివరీ కూడా ఏక కాలంలో జరిగిపోవడం తెలిసి అక్కడివారు ఆశ్చర్యపోతున్నారు. స్థానిక మీడియాలో ఈ కవల సోదరిమణుల విషయమే హాట్ టాపిక్ అయింది.