మానస సరోవరంలో హైదరాబాదీల నరకయాతన.. | Hyderabad Tourists Plight In Manasa Sarovaram | Sakshi
Sakshi News home page

మానస సరోవరంలో హైదరాబాదీల నరకయాతన..

Jun 24 2019 4:50 PM | Updated on Jun 24 2019 4:52 PM

Hyderabad Tourists Plight In Manasa Sarovaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మానససరోవరం వెళ్లిన తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో గత ఐదురోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నెల 13న హైదరాబాద్‌కి చెందిన 40 మంది మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. సదరన్‌ ట్రావెల్స్‌ ద్వారా యాత్రకు వెళ్లిన వీళ్లు.. చైనా నేపాల్ సరిహద్దు ప్రాంతమైన మానససరోవర్‌లో అనూహ్యంగా చిక్కుకుపోయారు. దీంతో గత నాలుగురోజులుగా బాహ్యప్రపంచాన్ని చూడలేని పరిస్థితుల్లో వీరు ఉన్నారు.  హైదరాబాద్‌ వాసులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ట్రావెల్ ఏజెన్సీ మాత్రం అస్సలు పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా సదరన్‌ ట్రావెల్స్‌ నుంచి స్పందన లేదని యాత్రికులు ఆరోపించారు. తమ గోడను వివరిస్తూ వీడియో రికార్డ్ చేసి కుటుంబసభ్యులకు పంపించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement