
ఊతకర్రల యంత్రుడు!
మనిషి మాదిరిగా ఊతకర్రలను ఉపయోగించుకుంటూ భవనాల శిథిలాలు, కొండలు కోనలు, ఎగుడుదిగుళ్లలో సునాయాసంగా తిరగగలిగే వినూత్న హ్యూమనాయిడ్ రోబోను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందిస్తున్నారు.
మనిషి మాదిరిగా ఊతకర్రలను ఉపయోగించుకుంటూ భవనాల శిథిలాలు, కొండలు కోనలు, ఎగుడుదిగుళ్లలో సునాయాసంగా తిరగగలిగే వినూత్న హ్యూమనాయిడ్ రోబోను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందిస్తున్నారు. సెన్సర్లు, కెమెరాలతో కూడిన హైటెక్ ఊతకర్రల సాయంతో ఈ రోబోలు సహాయక చర్యల్లో బాగా పాల్గొంటాయని చెబుతున్నారు.
ఊతకర్రలతో పరిసరాలను అర్థం చేసుకుంటూ తలలోని కెమెరాలు, సెన్సర్లతో సైతం పరిస్థితులను గమనిస్తూ ఇవి భవనాలు కూలినప్పుడు లేదా ఇతర విపత్తుల సమయాల్లో సమర్థంగా సేవలందిస్తాయని అంటున్నారు. అవసరమైనప్పుడు ఈ రోబో తన ఊతకర్రల పొడవును తగ్గించుకుని లేదా పెంచుకుని కూడా పనిచేస్తుందట. ఒకరకంగా ఊతకర్రలు దీనికి మరో రెండు కాళ్లలా ఉపయోగపడతాయట.