నేపాల్ను వణికిస్తున్న మరో భూతం | Human trafficking fear looms large over earthquake-hit Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్ను వణికిస్తున్న మరో భూతం

May 4 2015 11:02 AM | Updated on Sep 3 2017 1:25 AM

నేపాల్ను వణికిస్తున్న మరో భూతం

నేపాల్ను వణికిస్తున్న మరో భూతం

ప్రకృతి ప్రకోపంతో భీతిల్లిన నేపాల్ను ఇపుడు మరో భూతం వణికిస్తోంది. అసలే హ్యూమన్ ట్రాఫికింగ్కు పెట్టింది పేరుగా ఉన్న నేపాల్ దేశంలో మహిళల అక్రమ రవాణా మరింత పెరగొచ్చనే ఊహాగానాలు బలంగా సాగుతున్నాయి.

కఠ్మాండు:  ప్రకృతి ప్రకోపంతో భీతిల్లిన నేపాల్ను ఇపుడు మరో భూతం వణికిస్తోంది. అసలే  హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమ రవాణా)కు  పెట్టింది పేరుగా ఉన్న  నేపాల్ దేశంలో మహిళల అక్రమ రవాణా మరింత పెరగొచ్చనే  ఊహాగానాలు  బలంగా  సాగుతున్నాయి. ప్రస్తుతం  దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ట్రాఫికర్స్  రెచ్చిపోవచ్చనే అనుమానాలు  వణికిస్తున్నాయి.  

మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత  ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అరాచక శక్తులకు అడ్డుకట్టవేసేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దు దగ్గర, విమానాశ్రయాల దగ్గర హై అలర్ట్  ప్రకటించి, ఆయా ప్రదేశాలలో సీఐఎస్ఎఫ్ దళాలను, మఫ్టీ పోలీసులను  మోహరింపచేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా  పిల్లలు, మహిళా ప్రయాణీకుల వివరాలపై శ్రద్ధ పెట్టారు.   

నిపుణులతో కూడిన ఒక  కమిటి ప్రయాణీకుల వివరాలను, వారి వీసా  డాక్యుమెంట్లను క్షుణ్ణంగా  పరిశీలిస్తోందని ఢిల్లీ  విమానాశ్రయ అధికారులు తెలిపారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తున్నామని, దీనికి సంబంధించి చాలా హోమ్ వర్క్ చేశామని, ముఖ్యంగా  రోడ్డు మార్గం,  టాక్సీ బూత్, టాక్సీ యూనియన్లపై ఓ కన్నేసి ఉంచామని ఢిల్లీ సీనియర్  పోలీసు అధికారి తెలిపారు.   ప్రముఖ హెటళ్ళ దగ్గర కూడా నిఘా  పెట్టామన్నారు.

కాగా భీకరంగా విరుచుకుపడిన భూకంపం నేపాల్ దేశాన్ని వణికించిన విషయం తెలిసిందే.  వేలాదిమంది మృత్యువాత పడగా, శిథిలాల కింద  ఎంతమంది చిక్కుకున్నారో తెలియని పరిస్థితి.  తమ ఆప్తుల జాడ  తెలియక ఇప్పటికీ అనేకమంది అల్లాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement