యువకుడిని ముంచెత్తిన అలలు...

Huge Waves Sweep 20 Years Old Man Into Ocean In California - Sakshi

బలమైన అలలు ఇరవై ఏళ్ల యువకుడిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లిన ఘటన అమెరికాలో జరిగింది. సముద్ర తీరాన బండపై నిలుచున్న వ్యక్తిపైకి ఒక్కసారిగా అలలు ఎగసిపడ్డాయి. ఈ ఘటన డిసెంబర్‌ 20న కాలిఫోర్నియా సముద్ర తీరాన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘యుఎస్‌ శాంటా క్రజ్‌ ఫేస్‌బుక్‌’ పేజీ నిర్వాహకులు షేర్‌ చేశారు. ‘తీర ప్రాంతాల పర్యాటనకు వెళ్లిన వారు జాగ్రత్త. సముద్ర తీరం అంచులకు అస్సలు వెళ్లకండి. లేదంటే ఈ కుర్రాడి లాగే మిమ్మల్ని అలలు మింగొచ్చు జాగ్రత్త’  అంటూ హెచ్చరించారు. 

ఇక తొమ్మిది సెకండ్ల నిడివి గల ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘వామ్మో! ఆ వ్యక్తి బండరాయిపై చీమలా కనిపిస్తున్నాడు. అదృష్టవంతుడు.. లేదంటే క్షణాల్లో చచ్చేవాడే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు వ్యక్తి క్షేమంగా ఉన్నట్లు  అక్కడి అధికారులు వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top