సుత్తితో ఆవుల తలపై మోది.. | Horrific abattoir footage shows cattle bludgeoned to death with sledgehammers | Sakshi
Sakshi News home page

సుత్తితో ఆవుల తలపై మోది..

Jun 17 2016 6:44 PM | Updated on Apr 3 2019 4:43 PM

సుత్తితో ఆవుల తలపై మోది.. - Sakshi

సుత్తితో ఆవుల తలపై మోది..

మాంసాన్ని ఎగుమతి చేసేందుకు జంతువులను అత్యంత క్రూరంగా చంపుతున్నట్లు చూపించే ఓ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

మాంసాన్ని ఎగుమతి చేసేందుకు జంతువులను అత్యంత క్రూరంగా చంపుతున్నట్లు చూపించే ఓ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. స్లెడ్జింగ్ సుత్తులతో ఇద్దరు వియత్నామీలు ఆవులను వధిస్తున్నట్లు చూపుతున్న ఈ వీడియోలో కనికరం లేకుండా ఆవుల తలపై సుత్తితో మోది మరీ వాటిని చంపుతున్నారు. దీంతో ఆ భయానక పరిస్థితులను తట్టుకోలేక.. పక్కనే వధకు సిద్ధంగా ఉన్న జీవాలు కళ్లు తిరిగి పడిపోయాయి.

రక్తసిక్తంగా ఉన్న వధ గదిలో కట్టె గుంజలకు వధకు తెచ్చిన ఆవులను కట్టేశారు. అలా కట్టిన వాటి తలమీద సుత్తితో తీవ్రమైన వేగంతో అది మరణించే వరకూ ఆపకుండా కొట్టడంతో మొదట ఆ మూగజీవం ముందరికాళ్లను కిందకు వంచేసింది. ఆ తర్వాత బాధను భరించలేక పెద్దగా అరుస్తూ నేలకూలింది. దీంతో ఉలిక్కిపడిన పక్కనే ఉన్న మరో ఆవు ఒక్క దెబ్బ కూడా కొట్టకముందే కుప్పకూలిపోయింది. కాగా, ఇలా చంపిన ఆవు మాంసాన్ని వీరు ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తారు. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయిన తర్వాత స్పందించిన ఆస్ట్రేలియా, వియత్నాం ప్రభుత్వాలు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement