ఫేస్ బుక్ లైవ్లో బాలికపై గ్యాంగ్ రేప్ | Gang of teens kidnapped and raped a girl, 15, on Facebook Live | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ లైవ్లో బాలికపై గ్యాంగ్ రేప్

Mar 22 2017 12:56 PM | Updated on Sep 5 2017 6:48 AM

ఫేస్ బుక్ లైవ్లో బాలికపై గ్యాంగ్ రేప్

ఫేస్ బుక్ లైవ్లో బాలికపై గ్యాంగ్ రేప్

చికాగోలో దారుణం చోటుచేసుకుంది.

చికాగో:
చికాగోలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి షాపింగ్ మాల్కు బయలుదేరిన ఓ బాలకను కిడ్నాప్ చేసి పలువురు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా ఫేస్ బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. 40 మంది వరకు ఈ లైవ్ వీడియోను చూసి కూడా.. 911కు డయల్‌ చేయకపోవడం చాలా బాధాకరం అని చికాగో పోలీసు విభాగం అధికారప్రతినిధి ఆంటోనీ తెలిపారు. బాలికపై లైంగిక వేధింపులను చూస్తూ కూడా ఒక్కరూ పట్టించుకోలేదు. ఏ మాత్రం బాధ్యతగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు.  ఫేస్ బుక్ పేజీ ఆధారంగా నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సదరు వీడియోను పోలీసులు ఫేస్ బుక్ యాజమాన్యం సహకారంతో ఆ పేజీనుంచి తొలగించారు. ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఆదివారం సాయంత్రం షాపుకు వెళ్లిన తన కూతురు ఇంటికి తిరిగి రాలేదని బాలిక తల్లి స్టేసీ ఎల్కిన్స్ ఫిర్యాదులో పేర్కొంది. తమ బంధువులు లైవ్ వీడియో చూసి తనకు సమాచారం ఇచ్చినట్టు స్టేసీ ఎల్కిన్స్ పోలీసుల ఎదుట వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు బాలికను గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీడియోను పోస్ట్ చేసిన ఫేస్ బుక్ పేజీ వివరాల సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బాలికను కూడా ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement